అదుగో అంటూ బ్యానర్ ఇమేజ్ కి దెబ్బ!

Update: 2018-11-14 06:38 GMT
టాలీవుడ్ లో లెజెండరీ బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మొదట్లో భారీ చిత్రాలనే నిర్మించేవారు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా ఎన్నో సుపర్ హిట్లు నిర్మించిన సంస్థ మెల్లగా చిన్న సినిమాలకు పరిమితం అయింది.  'పెళ్ళిచూపులు'.. 'కేరాఫ్ కంచరపాలెం' లాంటి సినిమాలు బ్యానర్ ఇమేజ్ ని పెంచాయి.  కానీ వీటిలో 'కేరాఫ్ కంచరపాలెం'సినిమాకు వసూళ్ళు మాత్రం పెద్దగా లేవు.  సురేష్ బ్యానర్ నుండి వచ్చిన 'మెంటల్ మదిలో'.. 'ఈనగరానికి ఏమైంది' లాంటి సినిమాలు నిరాశపరిచాయి.

తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి వచ్చిన 'అదుగో' పూర్తిగా నిరాశ పరిచింది.  అటు నెగెటివ్ రివ్యూస్ ఇటు డల్ కలెక్షన్స్.  సహజంగా పెద్ద బ్యానర్ నుండి ఏవైనా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. కానీ జనాలు ఈ సినిమాను చూసేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదంటేనే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  ఏదేమైనా ఈ సినిమా వల్ల సురేష్ ప్రొడక్షన్స్ రెప్యుటేషన్ కూడా దెబ్బ తినిందనే టాక్ కూడా వినిపిస్తోంది.  ఒకరకంగా ఈ చిన్న సినిమాలు సురేష్ కు బ్యానర్ తలనొప్పిగా మారాయని అంటున్నారు.

ఇకపై 'అదుగో' లాంటి సినిమాలకు దూరంగా ఉండకపోతే ప్రేక్షకులు సురేష్ ప్రొడక్షన్స్ నుండి వచ్చే చిన్న సినిమాలను చూసేందుకు ఒకటికీ రెండు సార్లు ఆలోచిస్తారు.  సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు 'వెంకీ మామ' లాంటి మల్టి స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇది కాకుండా పలు ఇతర ప్రాజెక్టులు కూడా లైన్ లో ఉన్నాయి. 
Tags:    

Similar News