అదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని బన్నీ అండ్ కో టీమ్ సందర్శించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలోనూ బంజారాహిల్స్ లో వున్న కేబీఆర్ పార్క్ లో హల్ చల్ చేసిన బన్నీ చాలా కాలం తరువాత కోవిడ్ నేపథ్యంలో సిటీ దాటి బయట అడుగు పెట్డడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. బన్నీ ఉన్నట్టుంది కుంటాలా జలపాతాన్ని విజిట్ చేయడం ఏంటని అంతా అవాక్కయ్యా.
దాని నుంచి తేరుకునే లోపే బన్నీని వివాదం చుట్టుముట్టింది. బన్నీ అండ్ కో టీమ్ పై అదిలాబాద్ కి చెందిన స్వస్ఛంద సంస్థ పోలీస్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. కుంటాల పరిసరాల్లో విహరించడానికి ఎవరికీ అనుమతి లేదని, అలాంటి సమయంలో బన్నీ టీమ్ కు ఎలా అనుమతిచ్చారని సదరు సంస్థకు చెందిన కార్యదర్శి ప్రశ్నల వర్షం కురిపించడం సరికొత్త వివాదానికి తెర తీసింది. అనుమతి లేకుండా కుంటాలని సందర్శించడమే కాకుండా పక్కనే వున్న తిప్పేశ్వరంలో కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించి చిత్ర బృందం షూటింగ్ చేయడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే అదిలాబాద్ లోని నేరడిగొండ పోలీస్ స్టేషన్ లో సమాచార హక్కు సాధన సమితి ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు ఫిర్యాదు చేశారు. ప్రధమిక విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సదరు అధికారులు చెప్పడంతో అటవీ అధికారికి ఫిర్యాదు చేశారు . అయితే బన్నీ టీమ్ తిప్పేశ్వరంలో షూటింగ్ చేయలేదని లొకేషన్ హంట్ లో భాగంగా కొన్ని ఫొటోలు మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది.