'ఆదిపురుష్‌' ఫ‌స్ట్ లుక్ కు ఇంకా టైమ్ ప‌డుతుందా?

Update: 2022-05-30 13:30 GMT
పాన్ ఇండియా మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నాయి. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లైన అల్లు అర్జున్‌ 'పుష్ప‌', ఇటీవ‌ల విడుద‌లైన రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల 'ట్రిపుల్ ఆర్‌, ఏప్రిల్ 14న విడుద‌లైన రాకింగ్ స్టార్ య‌ష్ 'కేజీఎఫ్ 2' చిత్రాలు దేశ వ్యాప్తంగా ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ  వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త ట్రెండ్ ని సెట్ చేశాయి. 'పుష్ప' 350 కోట్ల‌కు పై చిలువు వ‌సూళ్ల‌ని రాబ‌డితే ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 చిత్రాలు 1000 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగ‌నున్న భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'ఆది పురుష్‌' మూవీపై ఇప్ప‌డు అంద‌రి దృష్టిప‌డింది. 'రాధేశ్యామ్‌' ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో ప్ర‌భాస్ కూడా ఈ మూవీపైనే ఆశ‌లు పెట్టుకున్నాడ‌ని తెలుస్తోంది. రామ‌య‌గాథ ఆధారంగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ఇండియ‌న్ సినిమాల్లోనే అత్య‌ధికంగా 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో టి సిరీస్ సంస్థ అధినేత‌లు భూష‌న్ కుమార్‌, కృష్ణ కుమార్ ల‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్, ప్ర‌శాంత్ సుతార్‌, రాజేష్ నాయ‌ర్ నిర్మిస్తున్నారు.

1993లో వ‌చ్చిన జ‌పాన్ మూవీ 'రామాయ‌ణ : ది లెజెండ్ ఆప్ ప్రిన్స్ రామా' మూవీని చూసి దాని నుంచి స్ఫూర్తి పొందిన ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ దాని ఆధారంగానే 'ఆది పురుష్‌'ని తెర‌కెక్కిస్తున్నారు. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుండ‌గా లంకేషుడు రావ‌ణుడిగా బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. సీత‌గా క్రితి స‌న‌న్‌, ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్ , హ‌నుమంతుడిగా దేవ్ ద‌త్త నాగే న‌టిస్తున్నారు. కేవ‌లం గ్రాఫిక్స్ కోస‌మే 250 కోట్లు ఖ‌ర్చే చేస్తున్నార‌ట‌.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీకి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అంతే కాకుండా మ‌రో ప‌క్క గ్రాఫిక్స్ వ‌ర్క్ ని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ మూవీ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నా మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌లేదు. దీనికి ంఇకా స‌మ‌యం తీసుకుంటారా? అని కామెంట్ లు చేస్తున్నారు.

ఇక ఈ మూవీ జ‌న‌వ‌రి 12 సంక్రాంతికి ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో  విడుద‌ల కాబోతోంది. అంటే ఈ సినిమా రిలీజ్ కు ఎంత లేద‌న్నా ఏడు నెల‌లు స‌మ‌యం వుంది.

500 కోట్ల బ‌డ్జెట్ తో చేస్తున్న సినిమా.. అంతే కాకుండా చాలా ఏళ్ల త‌రువాత రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేయాలంటే మేక‌ర్స్ కి క‌నీసం 6 నెల‌ల స‌మ‌యం అయినా ప‌డుతుంది. ఆ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటే ఈ మూవీ ఇండియాలోనే అత్యంత భారీ ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News