2డి సినిమా.. 3డి సినిమా.. ఈ రెండిటిలో ఆడియెన్ ప్రాధాన్యత ఏది? అంటే కచ్ఛితంగా 3డి సినిమానే. భవిష్యత్ అంతా 3డి -4డి-5 డి మాయాజాలానిదే హవా. ఇప్పటికే నేటితరం 3డికి అడిక్ట్ అయ్యింది. భారీతనం నిండిన హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు భారతదేశంలో విజయం సాధించడానికి కారణమిదే. మునుముందు తెలుగు (ఇండియన్) సినిమాల ఫార్మాట్ కూడా పూర్తిగా మారిపోయేందుకు ఛాన్స్ లేకపోలేదు. బాలీవుడ్ కి ధీటుగా భారతీయ సినిమాని మరో లెవల్ కి తీసుకెళుతున్న టాలీవుడ్ లో ఇలాంటి విప్లవం రావాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే దీనికి `ఆదిపురుష్ 3డి`తో ప్రభాస్ దారి చూపించబోతున్నాడా? అంటే అవుననే సమాచారం. ఈ చిత్రం 3డి ఫార్మాట్ లో సంచలనాలు సృష్టించడానికి వస్తోంది. 2డి- 3డి వెర్షన్లలో విడుదల కానుంది. తాజా సమాచారం మేరకు ఆదిపురుష్ ఐమ్యాక్స్ 3డి ఫార్మాట్ లో విడుదల కానుంది. ఓం రౌత్ ఇంతకుముందే ఆదిపురుష్ అప్ డేట్ గురించి ప్రభాస్ అభిమానులను ఆటపట్టించాడు. అతడు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రభాస్ అభిమానులను ఆటపట్టించే ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోని బట్టి ఐమాక్స్ ఫార్మాట్ లో మూవీ విడుదలయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. అతి త్వరలో చిత్ర బృందం నుండి దీనిపై ప్రకటన వెలువడనుంది.
ఈ పౌరాణిక డ్రామా ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతాదేవి పాత్రలో కనిపించనుంది. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపిస్తారు. దీనిని T-సిరీస్ - రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సన్నీ సింగ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు
``#ఆదిపురుష్ అభిమానులందరికీ నేను ఎప్పటినుండో చెప్పాలనుకుంటున్నాను.. సమయమాసన్నమైంది. 12 జనవరి 2023 వరకు వేచి ఉండలేము. #ఆదిపురుష్ #IMAX # లాస్ ఏంజెల్స్ #3D`` అంటూ ఓంరౌత్ ట్వీట్ చేశారు. 12 జనవరి 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ 3డి పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడిన సంగతి తెలిసిందే. తానాజీ 3డి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఓంరౌత్ ఆదిపురుష్ 3డిని మరో స్థాయిలో ఆవిష్కరించనున్నారని ప్రభాస్ అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు.
ప్రభాస్ నటిస్తున్న సలార్- ప్రాజెక్ట్ చిత్రాలపైనా తాజా అప్ డేట్ అందాల్సి ఉంది. 2022-23 సీజన్ లో డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో అదరగొట్టబోతుండడం అభిమానులను ఎగ్జయిట్ చేస్తోంది.