పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్ 3డి చిత్రీకరణను పూర్తి చేయగా నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ కోసం అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించి అసాధారణ విజువల్స్ ని తెరపైకి తెచ్చేందుకు ఓంరౌత్ ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ నటించిన పౌరాణిక జానర్ సినిమా ఇది. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటించింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెప్టెంబర్ నెలాఖరున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విక్రమ్ వేద నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. టీ సిరీస్ - రెట్రైఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ పాన్-ఇండియా చిత్రానికి సచేత్-పరంపర సంగీతం అందిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడతాడా?
`ఆదిపురుష్ 3డి`తో ప్రభాస్ సాంకేతికత పరంగా మరో స్థాయిని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం. ఈ చిత్రం 3డి ఫార్మాట్ లో విజువల్ ఫీస్ట్ గా రూపొందుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2డి- 3డి వెర్షన్లలో అత్యంత భారీగా ఆదిపురుష్ విడుదల కానుంది. ఐమ్యాక్స్ 3డి ఫార్మాట్ లోనూ ఈ మూవీ విడుదల కానుంది. ఓం రౌత్ ఇంతకుముందే ఆదిపురుష్ అప్ డేట్ గురించి ప్రభాస్ అభిమానులను ఆటపట్టించాడు. అతడు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రభాస్ అభిమానులను ఆటపట్టించే ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోని బట్టి ఐమాక్స్ ఫార్మాట్ లో మూవీ విడుదలయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చాడు.
ఈ పౌరాణిక డ్రామా ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఇందులో ఎవరు ఏ పాత్రను పోషిస్తున్నారు? అన్నది పరిశీలిస్తే.. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతాదేవి పాత్రలో కనిపించనుంది. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపిస్తారు. దీనిని T-సిరీస్ - రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సన్నీ సింగ్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు ఫస్ట్ లుక్ లాంచ్ కి ఇంకా కొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉంది. రణబీర్ బ్రహ్మాస్త్ర తర్వాత అత్యంత భారీగా విడుదలయ్యే చిత్రం ఆదిపురుష్. మరోసారి రికార్డుల గురించి చర్చించే అరుదైన సందర్భం చూస్తామని ప్రభాస్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.