అన్ని విమర్శలొచ్చినా ‘ఆదిపురుష్’నే ట్రెండింగ్?

Update: 2022-10-18 14:30 GMT
ఆదిపురుష్.. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో తీసిన ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్అయిన టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుందని అంటే.. మరికొందరు గ్రాఫిక్స్ బాగాలేదని విమర్శలు చేశారు. ఒక కార్టూన్ సినిమా చూసినట్టుందన్నారు. ఇక రామాయణంపై తీసిన ఈ సినిమాలో ప్రభాస్ కు మీసాలు పెట్టడం.. రావణుడిని అల్ట్రామోడల్ గా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే ఇన్ని విమర్శలు వచ్చినా సరే ‘ఆదిపురుష్’ దర్శకుడు ఔంరౌత్ మాత్రం వెనక్కితగ్గలేదు. ప్రభాస్ సైతం ఆరోపణలపై పెద్దగా పట్టించుకోలేదు. ఇన్ని వైపులా నుంచి విమర్శలు చుట్టుముట్టినా సరే.. ఆదిపురుష్ క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపితమైంది.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేసిన టీజర్ గా ‘ఆదిపురుష్’ నిలిచింది. గడిచిన 30 రోజులుగా గూగుల్ లో అత్యధికంగా వెతికింది ఆదిపురుష్ గురించే.. అన్ని టాపిక్ ల కంటే కూడా ‘ఆదిపురుష్’ టీజర్ ముందుంది. గూగుల్ లో +1,850 శాతం రేటింగ్ దీనికి రావడం విశేషం. ఇదే టాప్ గూగుల్ సెర్చ్ గా మారింది.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ ‘యూవీ క్రియేషన్స్ ’ సంస్థ తాజాగా ట్వీట్ చేసింది. ‘ఆదిపురుష్ ’ ఇంకా పైపైకి చేరుతోంది. అది ఎంత పైకి అన్నది ఈ గణాంకాలే చెబుతాయి అంటూ గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్న ఆదిపురుష్ పోస్టర్ ను ట్వీట్ చేసింది.

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ వచ్చే సంవత్సరం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. సీతగా కృతిసనన్ నటిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News