ఏ మాత్రం అంచనాలు లేకుండా, రకరకాల వివాదాల మధ్య విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. `బాహుబలి` తర్వాత ఆ స్థాయిలో చర్చనీయాంశమైన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ రేపింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ `కల్ట్ క్లాసిక్` మూవీ... రికార్డు కలెక్షన్లు సాధించింది. తాజాగా, ఇదే తరహాలో విడుదలైన `అరువి` చిత్రం కోలీవుడ్ లో అదరగొడుతోంది. విడుదలకు ముందు తమిళనాడులో హాట్ టాపిక్ అయిన ఈ సినిమా....విడుదలైన తర్వాత ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన అదితి బాలన్ అద్భుతంగా నటించిందని క్రిటిక్స్ కితాబిస్తున్నారు.
అదితి బాలన్ అనే కొత్త నటితో అరుణ్ ప్రభు పురుషోత్తం అనే కొత్త దర్శకుడు `అరువి`ని తెరకెక్కించాడు. విడుదలకు ముందే ఈ సినిమాను అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించగా పలు అవార్డులు దక్కించుకుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రివ్యూలకు విపరీతమైన స్పందన వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులతోపాటు ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఫిదా అయిపోయారు. తమిళ సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమా అని, ఈ ఏడాదికి ఇదే ఉత్తమ తమిళ సినిమా అని క్రిటిక్స్ స్టేట్ మెంట్ ఇచ్చారంటే ఈ సినిమా స్థాయి అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ తమిళ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై ఈ చిత్రానికి 4 రేటింగ్, డెక్కన్ క్రానికల్ 4.5 రేటింగ్ - టైమ్స్ ఆఫ్ ఇండియాల 4 రేటింగ్ ఇచ్చాయి. నయనతార కలెక్టర్ పాత్రలో అద్బుతంగా నటించిన `ఆరమ్` చిత్రం కన్నా `అరువి` అద్భుతంగా ఉందని అందరూ కితాబిస్తున్నారు. తనపై నక్సలిస్టు అని ముద్ర వేసిన కొందరు వ్యక్తులపై ఓ యువతి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇంత బోల్డ్ సబ్జెక్ట్ ను ధైర్యంగా తెరకెక్కించిన దర్శకుడిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి సినిమాలోనే ఇంత చాలెంజింగ్ పాత్రలో అద్భుతంగా నటించిన అదితి రావ్ కు అందరూ ఫిదా అయిపోయారు.