తీరంలో విర‌హ‌గీతం.. అందాల‌ అదితీ ఎవ‌రికోసం?

Update: 2021-09-07 23:30 GMT
అందానికి అందం న‌ట ప్ర‌తిభ ఉన్న క్రేజీ భామ‌గా అదితీరావ్ హైద‌రీ సుప‌రిచితం. హైద‌రాబాద్ మూలాలున్న ఈ బ్యూటీ ఆరంభం బాలీవుడ్ లో న‌టించి పాపులారిటీ పెంచుకుంది. ఆ త‌ర్వాత తెలుగులో సుధీర్ బాబు స‌ర‌స‌న `స‌మ్మోహ‌నం` అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆరంభ‌మే ఘ‌న‌విజ‌యం అందుకుని ఆ త‌ర్వాత సౌత్ లో మ‌ణిర‌త్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ న‌టిస్తోంది. ఇంత‌కుముందు అర‌వింద స్వామి తో న‌వాబ్ చిత్రంలో రొమాన్స్ అద‌ర‌గొట్టిన ఈ బ్యూటీ ఇటీవ‌ల‌ వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టిస్తోంది.

అదితి రావు హైదరి ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా చీరలో నాభి సొగ‌సును ఆరాంగా ఆవిష్క‌రించింది ఈ బ్యూటీ. పాల‌నురుగు దేహ‌శిరుల‌ను అలా ఓపెనప్ చేసిన తీరు కుర్రాళ్ల‌కు మ‌తులు చెడ‌గొడుతోంది. ఎర్ర‌కోక త‌న ఒంటిపై నిలవ‌నంటోంది! అన్న తీరుగా అలా స‌ముద్ర తీరంలో విర‌హ‌ గీతాన్ని ఆల‌పిస్తోంది. న‌వాబు కైనా స‌ముద్రుడి కైనా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే అన్నంత అందంగా క‌నిపిస్తోంది అదితీ.

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న `మహా సముద్రం`లో అదితి రావు హైదరి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది. శర్వానంద్ - సిద్ధార్థ్ ఇందులో క‌థానాయ‌కులు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే స‌ముద్రం నేప‌థ్యంలో సీరియ‌స్ ల‌వ్ యాక్ష‌న్ డ్రామాతో ఈ మూవీని అజ‌య్ తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో పాట‌ల్ని వేటిక‌వే ప్ర‌త్యేకం అన్న తీరుగా తెర‌కెక్కించార‌ని స‌మాచారం. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన చెప్పకే చెప్పకే అనే పాట నిన్న విడుదలైంది. సాంగ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. చార్ట్ బస్టర్ నంబర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.  `చెప్పాకే చెప్పకే..` సాంగ్ నుండి ఫోటో గ్రాఫ్ ఇది. అదితి ఈ లుక్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. అలా నాభి అందాల‌ను దోర‌గా ఆవిష్క‌రించి క‌వ్విస్తోంది. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం అక్టోబర్ 14 న విడుదలకు సిద్ధమవుతోంది.

ర‌ష్మిక ఆవిష్క‌రించిన గీతం..!

`మహాసముద్రం`లోని చెప్ప‌కే చెప్ప‌కే సింగిల్ ని రష్మిక మంద‌న్నా సోమవారం విడుదల చేశారు. పాట విని చాలా బాగుందని ప్ర‌శంసించారు ర‌ష్మిక‌. మహా సముద్రం  ఇంటెన్స్‌ ప్రేమకథా చిత్రం. ఈ సినిమా నుంచి దీప్తి పార్థసారథి పాడిన `చెప్పకే చెప్పకే` వెరీ స్పెష‌ల్. సాంగ్ ఆద్యంతం అదితీ ర‌క‌ర‌కాల చీర‌ల్లో సొగ‌సును తెర‌పరిచేసిన తీరు యూత్ కి కనెక్ట‌వుతోంది.
Tags:    

Similar News