చెలియా మూవీతో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయారు దిగ్గజ దర్శకుడు మణిరత్నం. అయితే తమిళ్ వెర్షన్ కాట్రు వెలియిదాయ్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆడింది. సక్సెస్ అనకపోయినా.. ఫ్లాప్ అయితే మాత్రం కాదు. ఆ మూవీలో హీరో కార్తి ఎంత కొత్తగా కనిపించాడో.. హీరోయిన్ అదితి రావు హైదరిని అంతకంటే అందంగా చూపించారు మణిరత్నం.
ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్న మణి సార్.. మరోసారి అదితినే హీరోయిన్ గా ఎంచుకున్నారట. ఇప్పటికే ఆమెను అడగడం.. మణిరత్నం నుంచి ఫోన్ రాగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకోవడం జరిగిపోయాయి కూడా. 'మణిరత్నం గారితో పని చేసేందుకు నేను ఎప్పుడైనా సిద్ధమే. ఆయన ప్రతీ ఫ్రేమ్ ను ఎంతో అందంగా సెట్ చేస్తారు. అంతే కాదు ఆఖరి నిమిషంలో చేసే ఇంప్రూవ్ మెంట్స్ అద్భుతంగా ఉంటాయి. నేను మొదట నాకు భాషతో ఇబ్బంది అని చెప్పినపుడు.. అది తన సమస్య తప్ప.. నాది కాదు అంటూ నవ్వారాయన. కొన్ని తమిళ్ వాక్యాలు దగ్గరుండి నేర్పించారు కూడా' అంటోంది అదితి రావు హైదరి.
చిన్నప్పటి నుంచి మణిరత్నంతో పని చేయాలని కోరిక ఉందని.. ఇలా వరుసగా ఆఫర్స్ రావడంతో తెగ సంతోషంగా ఉందని చెబుతోంది అదితి రావు హైదరి. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ మూవీ పద్మావతిని పూర్తి చేసిన వెంటనే.. మణిరత్నం తెరకెక్కించే రొమాంటిక్ మూవీలో జాయిన్ కానుంది అదితి.