హైదరాబాదీ మూలాలున్న బాలీవుడ్ కథానాయిక అతిధీరావ్ హైదారీ. టబు, దియామీర్జా తరహాలోనే ముంబైలో అడుగుపెట్టి అక్కడ ఫేమస్ మోడల్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. నటిగానూ క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యంలో ఈ అమ్మడికి కూడా కొంత భాగం ఉంది. లేటెస్టుగా అతిధీరావ్ ఓ ప్రఖ్యాత ఫెయిర్‌నెస్ క్రీమ్‌కి బ్రాండ్ ప్రచారకర్తగా ఎంపికైంది. ఈ అమ్మడిపై తీసిన ఫోటోషూట్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది.
'స్పావేక్' జపనీస్ ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనలో అమ్మడు చాలా హాట్‌గా కనిపిస్తోంది. స్పావేక్ ప్రకటన ఫోటోషూట్‌కి సంబంధించిన ఓ ఛాయాచిత్రాల్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానుల్ని ఊరించింది అమ్మడు. దీనికి జనాల్లోంచి, అభిమానుల నుంచి బోలెడన్ని ప్రశంసలొస్తున్నాయి. హాయ్ .. హాట్ లెగ్స్.. యు సో క్యూట్.. బ్యూటిఫుల్.. ట్రూలీ జార్జియస్.. మెస్మరైజింగ్ .. ఇలా అభిమానుల నుంచి పొగడ్తలు వచ్చి పడుతున్నాయి. ఈ భామ నటించిన గుడ్డు రంగీల, ది లెజెండ్ ఆఫ్ మైకేల్ మిశ్రా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి. ఔర్ దేవదాస్, వాజిర్ ప్రస్తుతం ఆన్‌సెట్స్ ఉన్నాయి.