సమకాలీన ప్రపంచంలో వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ ఐకాన్ ఎవరు అని అడిగితే? బహుశా `ఆడ్రీ హెప్బర్న్` అని చెబుతారు ఫ్యాషన్ ప్రియులు. ఫ్యాషన్ పరిశ్రమ హృదయాల్లో సదరు టాప్ మోడల్ కు ప్రత్యేక స్థానం ఉంది. స్టైల్ ఐకాన్ గా ఆమె పాపులారిటీ అంతాఇంతా కాదు. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత ఎంతో గొప్పది. 1993లో ఆమె మరణించిన తర్వాత కూడా హవా కొనసాగుతోంది. ఆమె సహజసిద్ధమైన అందం పిల్లి కళ్లతో ఏదో తెలియని మ్యాజిక్ చేసింది. తనదైన గాంభీర్యంతో హాలీవుడ్ లెజెండ్ గా ఏలింది.
తన అసాధారణమైన కెరీర్ జర్నీ మనోహరమైన అప్పీల్ అనేక పుస్తకాలు- చలనచిత్రాలు -డాక్యుమెంటరీలలో పొందుపరిచారు. ఇప్పుడు అందానికి మరో రూపం అయిన అదితి రావ్ హైదరీ ఆడ్రీ హెప్బర్న్ కు నివాళులర్పించింది. బ్రైడల్ ఆసియా మ్యాగజైన్ కవర్ కోసం ఈ బ్యూటీ ప్రఖ్యాత ఆడ్రీ హెప్ బర్న్ లుక్ లోకి రూపాంతరం చెందింది. ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఈ లుక్ కోసం మేకప్ టీమ్ ఎంతగానో శ్రమించిందట. అదితీ కవర్ షూట్ విభిన్నమైన లుక్ లు ప్రస్తుతం అంతర్జాలలో వైరల్ గా మారాయి.
బ్రైడల్ ఆసియా మ్యాగజైన్ కవర్ పేజీపై అదితి రావ్ హైదరీ ఛానల్ బ్లాక్ లుక్ లో కనిపించింది. ఈ డిజైనర్ డ్రెస్ ధర రూ. 1.85 లక్షలు. అదితి కవర్ పేజీపై ఆడ్రీని ప్రతిబింబించడం తో అది అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళ్లింది. రోహిత్ గాంధీ-రాహుల్ ఖన్నా ఈ డ్రెస్ కి డిజైనర్స్. అదితి కి బ్లాక్ కార్సెట్ గౌనును స్వీట్ హార్ట్ నెక్ లైన్ మరియు సీక్విన్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసారు. ఈ దుస్తుల విలువ దాదాపు రూ. 1.85 లక్షలు. ఆడ్రీ హెప్‌బర్న్ ధరించిన చిన్న నల్లటి దుస్తులు అదితి గౌనుకు స్ఫూర్తినిచ్చాయి. హుబెర్ట్ డి గివెన్చీ ఆడ్రీ దుస్తులను డిజైన్ చేసింది. ఆమె టిఫనీస్ లో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభ సన్నివేశంలో ఈ దుస్తులను ధరించింది. ఈ దుస్తులు ఇరవయ్యవ శతాబ్దపు చరిత్రలో అత్యంత పాపులారిటీ ఉన్న డిజైన్ గా పరిగణిస్తున్నారు. అదితి బ్లాక్ ఒపెరా గ్లోవ్స్ ని ధరించి రాణినే తలపిస్తోంది.
ఎల్టన్ జె ఫెర్నాండెజ్- అదితి మేకప్ ఆర్టిస్ట్- ఆడ్రీ మేకప్ కి అందమైన నివాళులర్పించారు. ఆమె బోల్డ్ లుక్ కి ప్రశంసలు దక్కాయి. ఇన్ వరల్డ్ ఫుల్ ఆఫ్ కర్దాషియాన్స్ బి యాన్ ఆడ్రీ.. అని అదితి తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అదితి రావ్ హైదరి చివరిసారిగా దుల్కర్ సల్మాన్ తో `హే సినామికా`లో కనిపించింది. మహాసముద్రం ఫ్లాపయ్యాక టాలీవుడ్ లో కనిపించలేదు. తదుపరి సినిమాలపై అప్ డేట్ తెలియాల్సి ఉంది.