తెలుగు.. తమిళం.. హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న మోస్ట్ ట్యాలెంటెడ్ ముద్దుగుమ్మ అదితి రావు హైదరి మరోసారి తన నటన ప్రతిభతో ఆకట్టుకుంది. మొదటి సారి ఒక వెబ్ కంటెంట్ తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న అజీబ్ దస్తన్స్ వెబ్ సిరీస్ లో అదితి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా అద్బుతంగా ఉందంటూ నెటిజన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. అదితి రావు హైదరి పోషించిన పాత్ర వెబ్ సిరీస్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
స్టార్ హీరోయిన్స్ ఇలా వెబ్ సిరీస్ లో అంతకు మించి అన్నట్లుగా తమ ప్రతిభను కనబర్చుతూ వస్తున్నాయి. హద్దులు లేకుండా ఓటీటీ కంటెంట్ విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ముద్దుగుమ్మ అదితి రావు కూడా వెబ్ కంటెంట్ లో నటించినట్లుగా చెబుతోంది. భారీ అంచనాల నడుమ వచ్చిన అజీబ్ దస్తన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నటీనటులు అంతా కూడా ఆకట్టుకున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ కు ఇండియాలో మంచి వ్యూ టైమ్ వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇక అదితి రావు హైదరి సినిమాల విషయానికి వస్తే తెలుగులో మహా సముద్రం అనే సినిమా చేస్తుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హిందీలో కూడా ఈమె సినిమాల్లో నటిస్తుంది. అజీబ్ దస్తన్స్ వెబ్ సిరీస్ సక్సెస్ అయిన నేపథ్యంలో మరి కొన్ని వెబ్ కంటెట్ ల్లో కూడా ఈమె నటించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి అదితి రావు తన అందంతో పాటు అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.