సినిమా ఇండ‌స్ట్రీలో బంధుప్రీతి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హీరోయిన్!

Update: 2021-03-13 14:30 GMT
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంధుప్రీతి గురించిన చ‌ర్చ ఈ నాటిది కాదు. సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ఈ అంశం తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. అయితే.. తాజాగా ఇదే విష‌య‌మై బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ మాట్లాడారు. నెపోటిజంపై త‌న అభిప్రాయాన్ని స్ప‌ష్టం వెల్ల‌డించారు.

‘‘బంధు ప్రీతి’ అనేది ఎక్కడ లేదో చెప్పాలని అన్నారు. ప్రపంచంలో ప్రతి చోటా నెపోటిజం ఉందన్నాారు హైదరీ. బ్యాగ్రౌండ్ ఉన్న‌వారికి సులువుగా అవ‌కాశాలు వ‌స్తాయి. కానీ.. ఈ విష‌యంలో నాకు ఎవ‌రిమీదా.. ఎలాంటి కోప‌మూ లేదు.’’ అని అన్నారు.

ఇక, తన ఎదుగుదల గురించి కూడా మాట్లాడారు. ‘‘నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను. నా ఎదుగుద‌ల నా శ‌క్తిని తెలియ‌జేస్తుంది. నేను క‌ల‌లు కంటాను.. వాటిని నెర‌వేర్చుకునేందుకు శ్ర‌మిస్తాను. అంతే త‌ప్ప‌.. ఇత‌రుల గురించి చెడుగా ఆలోచించ‌ను’’ అని వ్యాఖ్యానించారు అదితిరావు.

తన ప్రతీ నిర్ణయం తనకు శక్తినిస్తుందని, నిర్భయంగా ముందుకు సాగడానికి అవి సహకరిస్తుంటాయని చెప్పారు. టాలీవుడ్లో పలు చిత్రాాల్లో నటించిన అదితిరావు హైదరీ.. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అంతరిక్షం, సమ్మోహనం, ‘వి’ వంటి చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. సిద్ధార్థ్, శర్వానంద్ కాంబోలో రాబోతున్న ‘మహాసముద్రం’ సినిమాలోనూ నటిస్తోంది.
Tags:    

Similar News