క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోడానికి గల కారణాలను వెల్లడించిన హైదరి..!

Update: 2020-10-21 16:34 GMT
తమిళ హీరో 'మక్కల్ సెల్వన్' విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''తుగ్లక్‌ దర్బార్''. ఢిల్లీ ప్రసాద్‌ దీనాదయలన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో అదితి రావు హైదరిని హీరోయిన్‌ గా తీసుకున్నారు. కొంత షూటింగ్‌ జరిగాక కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే లేటెస్టుగా ఈ ప్రాజెక్ట్ లో బబ్లీ బ్యూటీ రాశీఖన్నా ని హీరోయిన్ గా తీసుకున్నట్లు మేకర్స్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో హైదరీ ఈ మూవీ నుంచి ఎందుకు తప్పుకుందో అని అందరూ ఆలోచించారు. ఈ నేపథ్యంలో 'తుగ్లక్‌ దర్బార్' సినిమా నుంచి వైదొలగడానికి గల కారణాలను వెల్లడిస్తూ అదితి రావు హైదరి ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.

''కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సహా ప్రపంచం మొత్తం ఈ ఏడాది 6-8 నెలలు నిలిచిపోయింది. అయితే దశలవారీగా పనులు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. దీని వల్ల ఆలస్యం జరగడంతో పాటు షెడ్యూల్స్ అన్నీ తిరిగి ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది. ఒక నటిగా నాకోసం ఎవరూ వెయిట్ చేయకూడదని నేను భావిస్తాను. నేను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. అలానే ఇంకా ప్రారంభించని ప్రాజెక్టులకి ఎటువంటి ఆలస్యం కలిగించకూడదనుకుంటున్నాను. అందుకే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. రాశీ ఖన్నా.. ఆల్ ది బెస్ట్. ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను!. తుగ్లక్ దర్బార్ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్'' అని అదితి రావు హైదరి ట్వీట్ చేసింది.

దీనికి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ స్పందిస్తూ ఫ్యూచర్ లో కలిసి వర్క్ చేద్దామని పేర్కొన్నారు. అలానే రాశీఖన్నా ట్వీట్ చేస్తూ 'థ్యాంక్యూ అదితి.. నిఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్' అని చెప్పింది. ఇదిలా ఉండగా విజయ్‌ సేతుపతి - రాశీ ఖన్నా కాంబోలో ఇంతకుముందు 'సంగ తమిజన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో వస్తున్న 'తుగ్లక్‌ దర్బార్' చిత్రంలో రాశీఖన్నా డీ గ్లామర్ రోల్ లో కనిపించనుంది. ఈ మధ్య కాస్త వెనుకబడిన రాశీ 'తుగ్లక్‌ దర్బార్' సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
Full ViewFull View
Tags:    

Similar News