అదితి మతి పోగొడుతోంది!!

Update: 2017-12-27 14:30 GMT
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ అయినా ఎక్కడికి వెళ్లినా తనను అందరు చూడాలని అనుకుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ భామలు అయితే అందుకు తగ్గట్టు వేషధారణతో వస్తారు. సినిమాల్లో కూడా కనిపించని విధంగా ఒక్కోసారి హాట్ లుక్స్ తో కూడా దర్శనం ఇస్తుంటారు ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా అదితి రావ్ హైదరి కూడా అదే తరహాలో విరుష్క రిసెప్షన్ కి వెళ్లింది.

వేడుకకు చాలా మంది సినీ తారలు వచ్చారు. ఇక క్రికెటర్లు కూడా వచ్చారు. అయితే కొంత మంది యువ హీరోయిన్స్ మాత్రం ఒకరికంటే ఒకరు పోటీగా హాటు డ్రెస్సులతో దర్శనం ఇచ్చారు. ముఖ్యంగా అదితి అయితే ఓ సైడ్ ట్రెడిషినల్ అంటూనే మరో వైపు గ్లామర్ అనే విధంగా కనిపించింది. అయితే రిసెప్షన్ కి వెళ్లేముందు అభిమానులను ఖుషి చేయాలనీ అనుకుందో ఏమో గాని హాట్ లుక్స్ కొన్ని స్టిల్స్ ఇచ్చి సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేసింది.

ముఖ్యంగా క్లివేజ్ తో దిగిన ఒక సెల్ఫీ అయితే కుర్రకారు మతి పోగొడుతోంది. మొన్నటి వరకు ఓ స్టైల్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తోంది అని నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అదితి రావ్ పలు యాడ్స్ లలో ఒక్కువగా కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఒక సినిమాను కూడా చేస్తుంది. ఇక పద్మావతి సినిమాలో కూడా ఒక పాత్రను చేసింది. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.    
Tags:    

Similar News