ఈ చెలియలో ఆ ట్యాలెంట్ కూడా

Update: 2017-04-06 05:47 GMT
హైద్రాబాదీ భామ అదితి రావు హైదరి.. తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మణిరత్నం లేటెస్ట్ మూవీ కాట్రు వెలియిదాయ్ చిత్రంలో కార్తి సరసన నటించగా.. ఇప్పుడీ సినిమా తెలుగులో చెలియా అనే టైటిల్ పై విడుదల కాబోతోంది. తెలుగు వెర్షన్ కి దిల్ రాజు నిర్మాత కావడంతో.. రేపు గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చెలియా సిద్ధమైంది.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ లో ఉన్న అదితి.. తాజాగా ఓ టెలివిజన్ షోకు వెళ్లింది. అక్కడ అందరూ రిక్వెస్ట్ చేయడంతో.. చెలియా చిత్రంలోని 'వాన్'పాటను పాడింది అదితి. అప్పుడు ఆశ్చర్యపోవడం అందరి వంతు అయింది. అంత అద్భుతంగా.. ఏ సింగర్ కి తీసిపోని రేంజ్ లో ఆమె గాత్రం ఉండడం.. పైగా ఆమె స్వరం వీనుల విందుగా ఉండడం విశేషం. ఇటు అందంతో పాటు.. అటు అందమైన గొంతు కూడా ఉండే హీరోయిన్లు చాలా చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదైన కాంబినేషన్ అదితి దగ్గర ఉంది.

పాడటం పూర్తయిన తర్వాత.. ఏఆర్ రెహమాన్ స్వరకల్పనలో ఒక్కపాటైనా పాడాలన్నది తన డ్రీమ్ అని చెప్పింది అదితి రావు హైదరి. ఇంతటి సుస్వర గాత్రానికి రెహమాన్ ఆ అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News