మీటూ : కోరిక తీర్చమంటే మూడు వదిలేశా

Update: 2018-10-09 12:11 GMT
టాలీవుడ్‌ లో శ్రీ రెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడిన సమయంలో ఏ స్థాయిలో అయితే అంతా మీడియా ముందుకు వచ్చి అందుకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్‌ బాలీవుడ్‌ లో వస్తుంది. ఇటీవల సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసి, అందరికి షాక్‌ ఇచ్చిన తనూశ్రీ దత్తా ఈ విషయాన్ని అంత సులువుగా వదిలేది లేదు అంటూ చెబుతోంది. మీటూ ఉద్యమాన్ని బాలీవుడ్‌ తో పాటు అన్ని సినిమా పరిశ్రమల్లో కూడా తీసుకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది. తనలాగే ఇంకా ఎవరైనా ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే మీటూ అంటూ ముందుకు రావాలని తనూశ్రీ దత్తా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.

మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అదితి రావు హైదరి కూడా తన గళం విప్పింది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు అనేవి లేవని నేను చెప్పను. ఖచ్చితంగా ఉన్నాయి. అయితే స్టార్‌ కిడ్స్‌ కు ఈ విషయంలో మినహాయింపు ఉంటుందా అనే విషయంలో నేను స్పందించను. కాని నాకు మాత్రం లైంగిక వేదింపులు ఎదురయ్యాయి. కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ముఖ్యంగా సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నించే సమయంలో నన్ను చాలా మంది కోరిక తీర్చమంటూ అడిగారు. ఒక నిర్మాత కోరిక తీర్చితే మూడు సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తాను అన్నాడు. కాని నేను అందుకు ఒప్పుకోలేదు.

సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది, కాని అందుకోసం ఆత్మాభిమానం వదిలేయాలని తాను ఎప్పుడు భావించలేదు అంటూ అదితిరావు చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలోని కొందరి వల్ల ఇక్కడ మహిళలకు రక్షణ లేదు అనే ముద్ర పడిపోయింది. కాని ఇక్కడ మంచి వారు కూడా ఉన్నారు కనుకే నాలాంటి వారికి ఛాన్స్‌ లు దక్కుతున్నాయి అంది. తెలుగులో ఈమె సమ్మోహనం చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తమిళంలో కూడా ఈమె ఒక చిత్రంలో నటించింది. హిందీతో పాటు సౌత్‌ చిత్రాల్లో కూడా ఈమె నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
Tags:    

Similar News