అందాల భామ అదితి రావు హైదరీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రాజుల కుటుంబం నుండి వచ్చిన ఈ అచ్చ తెలుగందం.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఓ మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్న అదితి.. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం తో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె వి, మహా సముద్రం వంటి చిత్రాలు చేసింది. కానీ, అవి అదితికి ఇక్కడ సరైన బ్రేక్ అందించలేకపోయాయి. అయితే నటన పరంగా మరియు గ్లామర్ పరంగా ఈ భామ మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న అదితా రావు హైదరి.. తాజాగా కొత్త కారు కొనుగోలు చేసింది.
అవును, తన గ్యారేజ్‌లో 'ఆడి క్యూ 7' అనే అత్యంత విలాసమైన కారుకు చోటు కల్పించింది. అదితి కారు కొన్న విషయాన్ని ఆడి కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో అధికారికంగా వెల్లడిస్తూ.. పలు ఫొటోలను సైతం పోస్ట్ చేసింది.
ఈ పిక్స్ లో కొత్త కారు పక్కన అందంగా మెరిసిపోతూ అదితి కనిపించడంతో.. ఆమెకు అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రేటు విషయానికి వస్తే.. లగ్జరీ బ్రాండ్ ఆడి క్యూ-7 కారు ధర ఎక్స్ షోరూంలో దాదాపుగా రూ.88.33 లక్షలు ఉంటుందని అంటున్నారు.
కాగా, అదితి రావు హైదరీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 2006 లో సినీ గడప తొక్కిన ఈ బ్యూటీ 2009లోనే బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 21 ఏళ్లే. కానీ, అదితికి పెళ్లైన విషయం చాలా మందికి తెలియదు.
అందుకు కారణం ఆమె ఒంటరిగా ఉండటమే. ఎందుకంటే, పెళ్లైన నాలుగేళ్లకే వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో సత్యదీప్ మిశ్రా, అదితిలు విడిపోయారు. 2013లో ఈ జంట చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల అనంతరం మాజీ భర్తతో ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్న అదితి.. మరోవైపు కెరీర్ పై కూడా ఫోకస్ పెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది.