నందమూరి బాలకృష్ణ మరోసారి తాను ఆదిత్య 369 యొక్క సీక్వెల్ ను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆదిత్య 999 పేరు తో రూపొందించబోతున్న సినిమాకు సంబంధించిన ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఆ సీక్వెల్ తో తనయుడు మోక్షజ్ఞ కూడా ఉంటాడని బాలయ్య గతంలో ప్రకటించాడు. స్టోరీ లైన్ సిద్ధంగా ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయినట్లే అంటున్నారు.
ఆదిత్య 999 సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను బాలయ్య చేపట్టబోతున్నాడు. సింగీతం వారి పర్యవేక్షణలో బాలయ్య సినిమాను డైరెక్ట్ చేస్తాడట. ఒకప్పుడు సినిమా మేకింగ్ వేరు.. ఇప్పుడు సినిమా మేకింగ్ వేరు. ఇప్పుడు పూర్తిగా గ్రాఫిక్స్ పై ఆదారపడి సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా కూడా మినిమం గా గ్రాఫిక్స్ ను కలిగి ఉంటున్నాయి.
బాలకృష్ణ ఆదిత్య 999 సినిమాను తెరకెక్కించాలంటే మొదట గ్రాఫిక్స్ గురించిన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆదిత్య 369 అప్పట్లోనే అద్భుతమైన విజువల్స్ తో రూపొందించడం జరిగింది. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే అంతకు మించి అన్నట్లుగా ఉంటేనే అభిమానులు ఒప్పుకుంటారు. కనుక బాలయ్య వీఎఫ్‌ఎక్స్ విషయంలో కాస్త ఎక్కువ హోం వర్క్ చేయాల్సి ఉంటుంది.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో కనుక కొన్ని షాట్స్ అయినా వీఎఫ్‌ఎక్స్ కీలకంగా ఉంటాయి. వాటిని బాలయ్య ఎలా డిజైన్ చేస్తాడు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. బాహుబలి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆ స్థాయి గ్రాఫిక్స్ కోరుకుంటున్నారు.
నాసిరకం గ్రాఫిక్స్ ను ప్రేక్షకులు ఈజీగా గుర్తిస్తున్నారు. కనుక ఆదిత్య 999 లో కాస్త అటు ఇటుగా గ్రాఫిక్స్ ఉంటే కచ్చితంగా డ్యామేజ్ పెద్దగా ఉండే అవకాశం ఉంది. బాలయ్య గతంలో దర్శకత్వంలో అనుభవం లేదు. నర్తనశాల ను మొదలు పెట్టినా ఆరంభంలోనే ఆపేసిన విషయం తెల్సిందే. కనుక ఈ సినిమాను చేయాలంటే మామూలు విషయం అయితే కాదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య తనకు లేని టెక్నికల్ నాలెడ్జ్ గురించి ముందస్తుగా తెలుసుకోవాలి.. అలాగే ఈ మధ్య కాలంలో తన కూతురు తేజస్విని ఫిల్మ్ మేకింగ్ లో అడుగు పెడుతుంది కనుక అలాంటి వారితో అయినా వీఎఫ్‌ఎక్స్ ఇతర అంశాల గురించి ఈ సినిమాకు వర్క్ చేయిస్తే బాగుంటుంది అనేది కొందరి సలహా. మొత్తానికి ఆదిత్య 999 అనేది బాలయ్యకు కాస్త పెద్ద ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.