దిల్ వాలే దుల్హనియా లే జాయేంగీ- షార్ట్ కట్ లో డీడీఎల్ జే.. ఈ మూవీ తెలియని సినీ లవర్ ఉండడేమో. 21 ఏళ్ల క్రితం రిలీజైన డీడీఎల్ జే సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ సినీ ఇండస్ట్రీలో అప్పటి వరకున్న రికార్డులు తుడిచేసి కొత్త రికార్డ్స్ సెట్ చేసింది. షారుక్ కి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. కాజోల్ ను కుర్రకారు కలల రాణిగా మార్చేసింది. సెన్సేషన్స్ కి కేరాఫైన ఈ మూవీ తీసింది దర్శక దిగ్గజం యష్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా. ఆదిత్యకి ఇదే మొదటి సినిమా.
23 ఏళ్ల వయసులో తొలిసారి డైరెక్షన్ చేసి ఫస్ట్ మూవీతోనే ఎవరూ మర్చిపోలేని సినిమా అందించిన ఆది ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది 3 సినిమాలే. నాలుగో సినిమాగా బేఫికర్ రాబోతుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా ఆదిత్య మూవీలో హీరో- హీరోయిన్స్ అంటే పద్దతిగా కనిపిస్తారు. కానీ బేఫికర్ మూవీలో మాత్రం రణవీర్- వాణికపూర్ ను అల్ట్రా మోడ్రన్ స్టేజ్ కూడా దాటించేశాడు ఆదిత్య. అసలు ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి టీజర్ ట్రైలర్ వరకు అన్నీ ముద్దులు.. బోల్డ్ కంటెంటే కనిపిస్తోంది. అసలు డీడీఎల్ జే తీసిన డైరెక్టరేనా ఈ మూవీ తీసింది అన్న అనుమానాలు కూడా వస్తున్నాయ్ చాలామందికి. అయితే అందరి డౌట్స్ తీరుస్తూ ఆది సమాధానం చెప్పాడు.
23 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు. ఈ జనరేషన్ వేరు. 23లో ఉన్నప్పుడు డీడీఎల్ జే నా ఏజ్ కి తగ్గ సబ్జెక్ట్. నాకు ఆలోచనలు అందరికీ నచ్చాయ్.. ఇప్పుడు నేను ట్వంటీ త్రీలో ఉంటే డీడీఎల్ జే కథ ఆలోచించలేను.. కాలం మారిపోయింది.. థాట్స్ మారిపోయాయ్. ఇప్పుడున్న యూత్ లా ఆలోచిస్తే బేఫికర్ కరెక్ట్ మూవీనే అంటున్నాడు. 20 ఏళ్లలో ప్రేమ నిర్వచనం మారిపోయింది. దానికి తగ్గట్టే నా మూవీ ఉంటుందంటున్నాడు. మరి డీడీఎల్ జేలో రాజ్- సిమ్రాన్ తో యూత్ ని పడేసిన ఆది.. ఈ సారి ధరమ్- షైరా గిల్ తో ఏం చేయిస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/