న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్.. బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' ని చాలామంది క్లాసిక్ గా పరిగణిస్తారు. ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం సవాలుతో కూడుకున్న విషయమే. హిందీలో ఈ రీమేక్ ను సందీప్ వంగానే స్వయంగా టేకప్ చేయడంతో మంచి బజ్ నెలకొంది. కానీ తమిళ రీమేక్ మాత్రం అటూ ఇటూ అయింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేసేందుకు సరిగ్గా ఈ సినిమా రీమేక్ నే ఎంచుకున్నారు. మొదట బాలా దర్శకత్వంలో 'వర్మ' టైటిల్ తో సినిమా షూటింగ్ జరగడం.. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో మొత్తాన్ని స్క్రాప్ చేసి కొత్త దర్శకుడితో మళ్ళీ ఫ్రెష్ గా తెరకెక్కిస్తున్నారు. ఇదంతా తెలిసిన విషయమే. ఈ కొత్త వెర్షన్ 'ఆదిత్య వర్మ' గా తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ రేపు.. అంటే జూన్ 16 న విడుదల కానుంది.
టీజర్ విడుదల తేదీని వెల్లడిస్తూ 'ఆదిత్య వర్మ' టీమ్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో ఈ టీజర్ ఎలా ఉండబోతోందో అని చర్చలు మొదలయ్యాయి. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన 'వర్మ' టీజర్ రిలీజ్ అయిన సమయంలో ధృవ్ పై.. టీజర్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. "బ్యాడ్ రీమేక్ కు 'వర్మ' ది బెస్ట్ ఎగ్జాంపుల్" అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. అసలు విజయ్ దేవరకొండలోని ఇంటెన్సిటీ ధృవ్ లో కనిపించడం లేదని.. ఒక అమూల్ బాయ్ లాగా కనిపించాడని విమర్శలు గుప్పించారు. విపరీతమైన ప్రాంతీయ అభిమానం ఉన్న తమిళ ప్రేక్షకులు ధృవ్ ను అలా విమర్శించారంటే ఆ టీజర్ ఏ రేంజ్ లో వారిని నిరాశపరిచిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ నెగెటివిటీని మర్చిపోయేలా చేసి ఈ టీజర్ తో 'అదిత్య వర్మ' టీమ్ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా వేచి చూడాలి. ఈ సినిమాతో గిరీశయ్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గిరీశయ్య 'అర్జున్ రెడ్డి' సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేయడమే కాకుండా గతంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. 'మహానటి' లాంటి సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడని సమాచారం. ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా రాధన్ సంగీత దర్శకుడు.