'ఆదిత్య -369' సీక్వెల్ బాల‌య్య 110 రేసులో!

Update: 2022-08-06 13:30 GMT
న‌ట‌సింహ బాల‌కృష్ణ -ప్ర‌ఖ్యాత దర్శ‌కుడు సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'ఆదిత్య 369' కి సీక్వెల్ తెరెకెక్కుత‌న్న‌ట్లు ఇప్ప‌టికే క‌థ‌నాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఓ సంద‌ర్భంలో ''సిగీంతం గారు క‌థ రెడీ చేస్తే నేను సిద్దంగానే ఉన్నాను'' అని బాల‌య్య  ఓపెన్  గానే చెప్పారు.  రెండు..మూడేళ్ల క్రిత‌మే ఈ విష‌యం తెర‌పైకి వ‌చ్చింది.

అయితే ఇంత వ‌ర‌కూ ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది లేదు. ఇంత‌కీ  సిగీతం సీక్వెల్ కి రెడీగా ఉన్నారా? అస‌లు ఈ కాంబినేష‌న్ లో సీక్వెల సాధ్య‌మేనా? అంటే చాలా సందేహాలే తెర‌పైకి వ‌స్తున్నాయి. సింగీతం వ‌య‌సు ఇప్పుడు 90 ఏళ్లు. మ‌రి ఈ వ‌య‌సులో సినిమా సాధ్య‌మేనా?  అప్పుడున్నంత యాక్టివ్ గా ఇప్పుడు సినిమా సాధ్య‌మేనా? అంటే సందేహాలు త‌ప్ప‌నిస‌రి.

ఆయ‌న చివ‌రిగా 2013లో' వెల్క‌మ్ ఒబామా' సినిమా చేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు చేసింది లేదు. అయితే వ‌య‌సు ప‌రంగా 90 క్రాస్ అయినా అయిప్ప‌టికీ ఆయ‌న చాలా యాక్టివ్ గా ఉంటారు.  హెల్త్  ప‌రంగా ఎంతో ఫిట్ గా ఉంటారు. అయితే సీక్వెల్ పై ఈ వ‌య‌సులో ఆయ‌న స్క్రిప్ట్  సిద్దం  చేయ‌గ‌లిగినా..దాన్ని తెర‌పైకి తీసుకురావ‌డం అన్న‌ది అంత ఈజీ కాదు. టెక్నిక‌ల్ గా సినిమాను హై స్టాండ‌ర్స్ లో కి మ‌ల‌చాలి.

సాంకేతిక‌ విష‌యాల‌పై ప‌ట్ల ఎంతో ప‌ట్టుండాలి. కానీ ఇప్పుడు వ‌యో భారం అందుకు అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. వాటిని అధిగ‌మించి సింగీతం సీక్వెల్ ని తెర‌కెక్కించాల్సి ఉంటుంది. తాజాగా బాల‌య్య 110వ సినిమాకి చేరువ‌లో ఉండ‌టంతో 'ఆదిత్య' సీక్వెల్  తెర‌పైకి వ‌స్తుంది. 110వ చిత్రంగా ఈ సీక్వెల్ ని తెర‌కెక్కిస్తే బాగుటుంటుంద‌నే ఆలోచ‌న నంద‌మూరి వ‌ర్గాల్లో మొదులుతున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ లో ఇలాంటి టెక్నిక‌ల్ మూవీ అయితే బాల‌య్య కి కొత్త ఇమేజ్ ని తీసుకొస్తుంద‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారుట‌. బాల‌య్య‌కి  ఎలాగూ అభ్యంత‌రం ఉండ‌దు కాబ‌ట్టి 110వ చిత్రంగా 'ఆదిత్య 369 'సీక్వెల్ అయినా? ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు.

అయితే  సింగీతం సీక్వెల్ కి పూనుకున్నా! స‌రైన  టెక్నిక‌ల్ టీమ్ ని పెట్టుకుని ముందుకు దిగాలి. లేదా?  కె ప్టెన్ బాధ్య‌త‌లు  అనుభ‌వం గ‌ల ద‌ర్శ‌కుడికి అప్ప‌గించి ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టాలి. మ‌ళ్లీ ఇక్క‌డ ప‌ర్య వేక్ష‌ణ అంటే  బాల‌య్య  అంగీక‌రించే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. సింగీత‌మే ప‌ని చేయాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డానికి అవకాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి.
Tags:    

Similar News