అలసిపోయాను.. చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వస్తా

Update: 2022-07-23 09:53 GMT
విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని వైవిధ్యభరిత సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ హీరోగా కంటే నటుడిగా మంచి పేరును దక్కించుకుంటున్న అడవి శేష్‌ త్వరలో హిట్ 2 సినిమా తో రాబోతున్నాడు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉండగా అడవి శేష్ బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అయ్యింది.

ప్రతిష్టాత్మక మేజర్‌ సినిమా లో నటించి.. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం దేశ వ్యాప్తంగా తిరిగిన అడవి శేష్‌ కాస్త బ్రేక్ కావాలని.. విశ్రాంతి కావాలని అంటున్నారు. మేజర్ సినిమా విజయంలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషించాయి. సినిమాను బాగా ప్రమోట్‌ చేయడం వల్లే భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. దేశంలో పలు చోట్ల సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు.

మేజర్ సినిమా సూపర్ హిట్‌ అయిన నేపథ్యంలో ఆయన హిట్‌ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టు ఈ కథ తిరుగుతుందట.

సినిమా షూటింగ్‌ కు అడవి శేష్‌ హాజరు అవ్వలేక పోతున్నాను అంటూ ఒక లేఖ రాశాడు. అలసి పోయాను. షూటింగ్‌ కు కాస్త బ్రేక్ కావాలి. అందుకే హిట్‌ 2 ను వచ్చే నెలలో కొత్త షెడ్యూల్‌ కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

మానసికంగా మరియు శారీరకంగా చాలా అలసి పోయాను. అందుకే హిట్ 2 నాని మరియు శైలేష్ లను అడిగాను అన్నాడు. త్వరలోనే హిట్‌ 2 సినిమా ను పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని అడవి శేష్‌ చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్‌ ఇప్పటికే మెజార్టీ పార్ట్‌ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. త్వరలో బ్యాలెన్స్ పూర్తి చేస్తారట.

హిట్ 1 లో విశ్వక్‌ సేన్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు మంచి స్పందన వచ్చింది. థియేట్రికల్‌ రిలీజ్ లోనే కాకుండా ఓటీటీ ద్వారా కూడా హిట్‌ నిజంగా పెద్ద హిట్‌ అయ్యింది. అందుకే హిట్‌ 2 కి విపరీతమైన బజ్‌ ఉంది. పైగా అడవి శేష్‌ నటిస్తున్న కారణంగా హిట్‌ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ప్రేక్షకులు ఉన్నారు. మరి మొదటి కేసు స్థాయిలో రెండవ కేసు ఆసక్తిగా సాగుతుందా అనేది చూడాలి.
Tags:    

Similar News