టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్ ల పెళ్లి మ్యాటర్ ప్రతీ సారి చర్చనీయాంశంగా మారుతూ వుంటుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ లు బ్రహ్మచర్యాన్ని వదిలేసి పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో బ్యాచిలర్స్ మిగిలే వున్నారు. ఇందులో సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సంఖ్య కూడా పెద్దదే. అయితే వాళ్లని పెళ్లెప్పుడని అడిగితే మాత్రం ప్రతీ సారి తప్పించుకు తిరుగుతూనే వున్నారు. కొంత మంది హీరోలైతే సీనియర్స్ వున్నారు కదండీ వాళ్ల తరువాతే నేను అనేస్తున్నారు.
ఇలా నిర్మొహమాటంగా చెప్పేస్తున్న యువ హీరోల్లో అడివి శేష్ ముందు వరుసలో నిలుస్తున్నారు. ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన చిత్రం `మేజర్` లో నటించిన అడివి శేష్ ఈ ఈ మూవీతో జూన్ 3న పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2008 ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని శశి కిరణ్ తిక్క తెరకెక్కించారు.
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు హీరో అడివి శేష్. ఈ సందర్భంగా తన పెళ్లి ఎప్పుడని అడిగితే ఆసక్తికరంగా సమాధానం చెప్పి షాకిచ్చారు. ప్రభాస్ - అనుష్కలకు ఇంకా పెళ్లిళ్లు కాలేదు కదా? అంటూ సమాధానం చెప్పాడు. చిత్ర పరిశ్రమలో ఇంకా మ్యారేజ్ కావాల్సిన వాళ్లు చాలా మంది వున్నారు. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నాడు. అంతే కాకుండా నా ఫ్రెండ్ అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు. రానా పెళ్లైపోయింది కానీ ప్రభాస్ పెళ్లి కాలేదు. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాకే నేను పెళ్లి చేసుకుంటా అని షాకిచ్చాడు అడివి శేష్.
ఇక తనకు పెళ్లి ప్రపోజల్స్ కంటే లవ్ ప్రపోజల్సే ఎక్కువగా వచ్చాయిని, కొన్ని సార్లు పెళ్లైన వాళ్లు కూడా వచ్చి తనకు ప్రపోజ్ చేశారట. కావాలంటే భర్తలకు విడాకులిస్తామని, పెళ్లి చేసుకోమని అడిగారట. పెళ్లి చేసుకోమని మా అమ్మ రోజూ సతాయిస్తోంది. అమ్మాయి అయితే చాలు పెళ్లిచేసుకో అనే స్థాయికి వచ్చేశారట శేష్ పేరెంట్స్ . అంతే కాకుండా కొరియన్ అమ్మాయి దొరికినా పెళ్లి చేసేస్తామని చెబుతున్నారట.
అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో వున్నానని తెలిపిన అడివి శేష్ ఆ అమ్మాయి ఎవరన్నది మాత్రం చెప్పనన్నాడు. కానీ ఇటీవల మాత్రం తన ప్రేమ, రిలేషన్ షిప్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. `మేజర్` రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అడివి శేష్ ఈ మూవీ తరువాత నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న `హిట్ 2` షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.