హాలీవుడ్ ఆలోచనలున్న టాలీవుడ్ హీరో!

Update: 2018-08-05 13:23 GMT
సహజంగా రైటర్లు మెగాఫోన్ పట్టి  డైరెక్టర్లు అవుతుంటారు.. యాక్టర్లు కూడా అప్పుడప్పుడూ మెగా ఫోన్ పడుతుంటారు అనుకోండి కానీ అది చాలా రేర్ గా జరుగుతుంది. కానీ అడివి శేష్ ఉన్నాడే.. ఈయన చాలా డిఫరెంట్.  యాక్టర్ గా ఉంటూనే - హీరో వేషాలేస్తూనే - 'క్షణం' లో 'గూఢచారి' ని తయారు చేస్తూ ఆడియన్స్ మతులని పోగొడుతున్నాడు.

ఇప్పటికే తను కథ అందించిన 'క్షణం' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జస్ట్ రూ. 1.5 కోట్లలో తెరకెక్కిన ఆ చిత్రం నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావడమే కాకుండా ఇతర భాషల్లోకి కూడా రీమేక్ అయింది.  అడివి శేష్ తాజాగా కథ అందించి - హీరోగా నటించిన 'గూఢచారి' ఇప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తోంది.   ఈ సినిమాను రూ. 6.5 కోట్లలో తెరకెక్కించారంటే అసలు నమ్మబుద్దే కాదు.. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ చాలా రిచ్ గా కనిపిస్తోంది.  ఈ సినిమాను 168 లోకేషన్స్ లో 116 రోజుల పాటు తెరకెక్కించారట.  సినిమా కోసం రెండేళ్ళు శ్రమించారంటే మనం వాళ్ళ తపన అర్థం చేసుకోవచ్చు.  అయినా తక్కువ బడ్జెట్ లో సినిమా కంప్లీట్ కావడానికి పర్ ఫెక్ట్ ప్లానింగే కారణం.

అడివి శేష్ లాంటి హీరోలు - శశికిరణ్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు ఉంటే మేకింగ్ పరంగా టాలీవుడ్ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి సినిమాలు కొత్త ఫిలిం మేకర్స్ కు ఇన్ స్పిరేషన్ గా నిలుస్తాయి.. తమ ఆలోచనలపై నమ్మకాన్ని పెంచుతాయి.  రొటీన్ సినిమాలు తీస్తూ థియేటర్లు దొరకడం లేదని - జనాలు పైరసీలో సినిమాలు చూస్తున్నారని మొత్తుకునే బదులు ఇలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులకి మేకర్స్ పై గౌరవం పెరుగుతుంది. 
Tags:    

Similar News