డేంజర్ జోన్ లో గూఢచారి

Update: 2018-07-25 14:31 GMT
అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో  రూపొందిన గూఢచారి ఆగస్ట్ 3న విడుదల కానుంది. అడవి శేష్ హీరోగా తెలుగు  మోడల్ శోభిత ధూళిపాళను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తీసిన ఈ మూవీ టాలీవుడ్ లో  చాలా అరుదుగా వచ్చే స్పై థ్రిల్లర్ జానర్ లో వస్తోంది. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వీటికి బ్రాండ్ అంబాసడర్ గా ఉండేవారు. ఆయన నటించిన గూఢచారి సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్స్. చిరంజీవి కూడా గూఢచారి నెంబర్ 1 అనే పేరుతో అప్పట్లో ట్రై చేసారు కానీ అంతగా వర్క్ అవుట్ కాకపోవడంతో  తన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వైపుకు వచ్చేసారు. తర్వాత ఎవరు టచ్ చేసిన దాఖలాలు లేవు. ప్రేక్షకులు కూడా ఇలాంటివి ఆశించడం మానేశారు.

కానీ బాలీవుడ్ లో  మాత్రం ఈ బాపతు సినిమాలు  వస్తూనే ఉంటాయి కానీ మనదగ్గర తక్కువే. ఇన్నాళ్లకు గూఢచారి వస్తోంది. టీజర్ ఆకట్టుకునేలా ఉంది కానీ ఇన్  సైడ్ టాక్ ప్రకారం క్షణం బడ్జెట్ పరిధి దాటిపోయిందని కాస్ట్ పరంగా నిర్మాతకు ఫెయిల్యూర్ గా మిగలవచ్చనే గుసగుసలు మొదలయ్యాయి. టీజర్ ని  గమనిస్తే ఖర్చు విషయంలో రాజీ పడలేదని అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ ని థియేట్రికల్ రైట్స్ ద్వారా తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అడవి శేష్ కు పేరైతే ఉంది కానీ సోలోగా తన పేరు మీద సినిమాను అమ్మేంత లేదా భారీ ఓపెనింగ్స్ తెచ్చే రేంజ్ అయితే లేదు. గతంలో వచ్చిన క్షణం లో బడ్జెట్ లో రూపొందడమే కాకుండా కంటెంట్ పరంగా విన్నూతంగా ఉండటంతో వర్క్ అవుట్ అయ్యి నిర్మాతకు  లాభాలు ఇచ్చింది.

కానీ గూఢచారి కేసు వేరు. అనుకున్న దాని కన్నా  ఎక్కువ ఖర్చు పెట్టారు. జనరల్ పబ్లిక్ లో గూఢచారి అనే సినిమా అడవి శేష్ హీరోగా వస్తోందని రిజిస్టర్ కాలేదు. ఇది నిర్మిస్తున్న అభిషేక్ సంస్థ సాక్ష్యం విడుదల హడావిడిలో పడి గూఢచారి ప్రమోషన్ విషయంలో కాస్త స్లో అయిపోయింది. పవన్ మొదటి సినిమా హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ  రీ ఎంట్రీ  ఇస్తున్నప్పటికీ ఆ ఒక్క కారణంగా బజ్ వచ్చే సీన్ లేదు. మరి సినిమాలోనే కాకుండా బయట కూడా ఇంత రిస్క్ చేస్తున్న గూఢచారి బాక్స్ ఆఫీస్ యుద్ధం గెలవడం అంటే అంత ఈజీగా కనిపించడం లేదు.
Tags:    

Similar News