మమ్మీ డాడీ ఇండియా వస్తే బాగుండు

Update: 2018-01-02 00:30 GMT
చాలామంది స్టార్లు.. టాలీవుడ్ లో స్టార్లు అయ్యాక.. రిటైర్ అయిపోయాక.. అప్పుడు అమెరికా వంటి దేశాలు వెళ్ళి సెటిల్ అవుతారు. కాని ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోయింది. అసలు అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగోళ్లు కూడా ఇక్క యాక్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. వీరిలో వరుణ్‌ సందేశ్‌.. అడివి శేష్‌.. మనీషా రాజ్ (2 కంట్రీస్ హీరోయిన్) వంటి తెలుగోళ్లు మాత్రమే కాకుండా.. మాజీ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ.. ఇప్పటి సెన్సేషన్ అనూ ఎమ్మానుయేల్.. ఇలా అందరూ అమెరికాలో పుట్టి పెరిగి ఇండియా వచ్చినవారే.

వీరిలో చాలామంది తమ సినిమాల కెరియర్ పూర్తవ్వగానే అమెరికా వెళ్ళిపోతారు. ఆల్రెడీ వరుణ్‌ అండ్ రిచా అక్కడికే వెళిపోయారు. అయితే అడివి శేష్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాడట. మనోడు ప్రస్తుతం గూఢాఛారి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత లైన్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ గూఢచారి పూర్తి చేయడానికి జనవరి మొదటివారంలో అమెరికా షెడ్యూల్ కు వెళుతున్నాడు. ఈ సందర్భంగా తను 2018 న్యూ ఇయర్ గిఫ్ట్ క్రింద.. తన తల్లిదండ్రులను ఇండియా వచ్చి సెటిల్ అవ్వమని కోరుతున్నాడట.

చిన్నప్పటి నుండి కాలిఫోర్నియాలో పుట్టిన పెరిగిన అడివి శేష్.. తెలుగు సినిమా తనే స్వయంగా తీసి నటించి.. దానితో ఇండియా వచ్చాడు. ఇక యాక్టర్ గా ఇక్కడ బిజీ అయిపోవడంతో.. ఇప్పుడు ఇండియాలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాడట. అది సంగతి.



Tags:    

Similar News