క్రేజీ కాంబో సెట్ అయ్యిందే.. మహేష్ బ్యానర్ లో ఆ హీరో!

Update: 2019-02-07 13:30 GMT
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు హీరోగానే నటన మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఎఎంబీ సినిమాస్ తో మల్టిప్లెక్స్  బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దానికంటే ముందే ఎం.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి 'శ్రీమంతుడు' సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.   ఈమధ్య మహేష్ నిర్మాతగా ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తల వచ్చాయి.  ఆ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడక ముందే ఇప్పుడు మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది.  

మహేష్ బాబు ఒక సినిమాను నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఇప్పుడు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో అడివి శేష్ ను హీరోగా ఎంచుకున్నాడని సమాచారం.  'క్షణం'..'గూఢచారి' లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు శేష్.  మహేష్ నిర్మించనున్న ఈ సినిమాకు 'గూఢచారి' దర్శకుడు శశికరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.  యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారాలు మహేష్ వైఫ్ నమ్రత చూసుకుంటున్నారని సమాచారం.

శేష్ ప్రస్తుతం '2 స్టేట్స్' తో పాటు 'గూఢచారి 2' సినిమాలతో బిజీగా ఉన్నాడు. అడివి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ నెలాఖరున ఒక గుడ్‌ న్యూస్‌ చెప్తాను.. ప్రస్తుతానికి అది సస్పెన్స్‌ అంటూ ఒక ట్వీట్ చేశాడు. దానికి రిప్లై ఇస్తూ "ఏంటి పెళ్లి గురించి చెప్తావా?" అంటూ ఈషా రెబ్బా ఫన్నీగా అడిగింది.  దానికి సీరియస్ ఎమోజితో జవాబిచ్చాడు. సో ఆ న్యూస్ 'పెళ్లి' కాదని తేలిపోయింది.  మరి మహేష్ బాబు బ్యానర్ లో ఫస్ట్ సినిమా హీరో అంటే గుడ్ న్యూసే కదా?  లెట్స్ వెయిట్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్!
Tags:    

Similar News