'శతురంగ వేట్టై' తెలుగులోకి

Update: 2017-02-02 07:57 GMT
శతురంగ వేట్టై.. రెండేళ్ల కిందట తమిళంలో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా. ఇందులో పేరున్న హీరో లేడు. మిగతా నటీనటులు కూడా పెద్దగా పేరు లేని వాళ్లే. దర్శకుడు కొత్తవాడు. నిర్మాతలూ అంతే. కానీ సినిమాలో మంచి విషయం ఉండటంతో సినిమా సూపర్ హిట్టయింది. త్రివిక్రమ్ ‘అఆ’ సినిమాకు ఛాయాగ్రహణం అందించిన నటరాజ్ సుబ్రమణ్యం ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. చిన్నతనంలో డక్కా మొక్కీలు తిని దొంగగా మారిన వ్యక్తి.. తన తెలివి తేటలతో ఎలా ఘరానా మోసాలు చేస్తూ బతికాడనే కథాంశంతో తెరకెక్కిన సినిమా. గత ఏడాది హైద‌రాబాద్‌ లో లైఫ్ స్టైల్ బిల్డింగ్ య‌జ‌మాని మ‌ధుసూద‌న్ రెడ్డి ఒక బురిడీ బాబా చేతిలో బోల్తా కొట్ట‌డం గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్టుతో ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ కూడా ఉంటుంది.

కొత్త దర్శకుడు వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. అడివిశేష్ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు. గతంలో ‘ఆదిత్య 369’ తీసి.. ఈ మధ్యే ‘జెంటిల్మన్’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన శివలెంక కృష్ణప్రసాద్ ‘శ్రీదేవి మూవీస్’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న కోలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇందులో క‌థానాయిక‌. గోపీ గ‌ణేష్ ద‌ర్శ‌కత్వం వహిస్తాడు. ఏప్రిల్లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టి.. జులైలో సినిమాను విడుద‌ల చేస్తార‌ట‌. విశేషం ఏంటంటే.. ‘శతురంగ వేట్టై’ తెలుగులోకి రీమేక్ అవుతున్న సమంలోనే త‌మిళంలో దానికి సీక్వెల్ తయారవుతోంది. అర‌వింద్ స్వామి-త్రిష జంట‌గా న‌టిస్తున్నారందులో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News