కియరా గేమ్ ఛేంజింగ్ లుక్ వైరల్
ఈ సినిమా ప్రథమార్థం అద్భుతంగా వచ్చిందని పుష్ప దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్'లో కథానాయికగా నటిస్తోంది కియరా అద్వాణీ. శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ సినిమాలో నటించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించింది. గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రథమార్థం అద్భుతంగా వచ్చిందని పుష్ప దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించారు.
ఇక డల్లాస్ (అమెరికా)లో ప్రీరిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ బృందం సందడి చేయగా, అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. ఇంతలోనే చిత్రకథానాయిక కియరా అద్వాణీ గేమ్ ఛేంజర్ ప్రచారానికి తాను సైతం అంటూ బరిలోకి దిగింది.
ఇంతకుముందే గేమ్ ఛేంజర్ మొదటి పాట కోసం తెరవెనక ప్రాక్టీస్ ఎలా ఉంటుందో ఆవిష్కరించే ఓ డ్యాన్స్ వీడియోను కియరా పోస్ట్ చేసింది. కియారా డిస్నీల్యాండ్ ని తలపించే సెట్‌లో 13 రోజుల పాటు పాటను చిత్రీకరించడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది. ప్రాక్టీస్ సెషన్స్ కి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ.. కియరా ఇలా వ్యాఖ్యానించింది. గేమ్ ఛేంజర్ మొదటి షెడ్యూల్ కోసం రిహార్సల్‌లో మొదటి రోజు స్నీక్ పీక్ ఇది. ఎస్.శంకర్ సర్ అందంగా రూపొందించిన #ధోప్ పాట చిత్రీకరణతో సినిమాను ప్రారంభించాము'' అని తెలిపింది. ఎప్పుడూ కొత్తదనాన్ని నేర్చుకోవడం చేసే పనికి అందం. కొత్త స్టైల్ డ్యాన్స్.. డబ్‌స్టెప్/క్లాసికల్/రోబోటిక్/హిప్ హాప్.. నృత్యాలివి. నాకు తెలిసిన అత్యుత్తమ డ్యాన్సర్‌లలో ఒకరైన RCతో స్టెప్పులు వేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది'' అని కియరా రాసింది. థమన్ ప్రత్యేక బీట్స్, మనీష్ మల్హోత్రా అద్భుతమైన కాస్ట్యూమ్స్... మెహక్ ఒబెరాయ్ అద్బుతమైన మేకప్ ని అందించారని కూడా కియరా వెల్లడించింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ నుంచి కియరా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. దీనిలో పసుపు రంగు ఛమ్కీ స్ట్రిప్ డ్రెస్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఆల్బమ్‌లోని నాల్గవ సింగిల్ 'ధోప్' టీజర్‌ను విడుదల చేశారు. రామ జోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ లో ఎస్.జే.సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.