ఆచితూచి అన్నట్లుగా ట్యాలెంటెడ్‌ హీరో

Update: 2019-07-07 06:22 GMT
కెరీర్‌ ఆరంభం నుండి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ సక్సెస్‌ లను దక్కించుకుంటున్న నటుడు అడవి శేషు. నటనతో పాటు రచయితగా దర్శకుడిగా కూడా శేషు మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకున్నాడు. 'గూఢచారి' చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న అడవి శేషు స్పీడ్‌ గా సినిమాలు చేయకుండా మెల్ల మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఎవరు' అనే చిత్రాన్ని విడుదలకు సిద్దం చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఎవరు చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది.

ఎవరు చిత్రం తర్వాత అడవి శేషు 'మేజర్‌' అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంను మహేష్‌ బాబు ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీతో కలిసి నిర్మించబోతున్నాడు. ఆ తర్వాత 'గూఢచారి' సీక్వెల్‌ ను అడవి శేషు చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈయన సినిమాల ఎంపిక విషయంలో మరియు వాటిని చేసే విషయంలో హడావుడి లేకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.

తాజాగా శేషు ఒక టీవీ ఛానెల్‌ తో మాట్లాడుతూ.. మేము 'ఎవరు' సినిమాను ప్రారంభించినప్పుడు సినిమా గురించి బయట ఎలాంటి ప్రచారం జరగకూడదని భావించాం. సైలెంట్‌ గా సినిమాను పూర్తి చేయాలనుకున్నాం. అనుకున్నట్లుగానే సినిమాను సైలెంట్‌ గా పూర్తి చేశాం. విడుదల సమయంలో సినిమా హడావుడి ఉండాలే కాని సినిమా ప్రారంభం అయినప్పటి నుండే అక్కర్లేదు అనేది నా అభిప్రాయం. ఒక సినిమా సక్సెస్‌ కావాలంటే టీం వర్క్‌ తప్పనిసరి. నేను టీం వర్క్‌ ను నమ్ముతాను. సినిమా పబ్లిసిటీ కంటే కంటెంట్‌ ప్రేక్షకులను థియేటర్‌ వద్దకు తీసుకు వస్తుందని నేను నమ్ముతాను అన్నాడు. ఆగస్టు 23న 'ఎవరు' సినిమాను విడుదల చేయబోతున్నారు. రామ్‌ జీ దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రెజీనా హీరోయిన్‌ గా నటించగా అడవి శేషు తో పాటు కీలక పాత్రలో నవీన్‌ చంద్ర ఈ చిత్రంలో నటించాడు.

Tags:    

Similar News