క్షణం పోయినా పర్లేదంటున్నాడు

Update: 2017-12-14 04:41 GMT
రూ. 1.1 కోట్ల టైట్ బడ్జెట్ తో రూపొంది.. ప్రేక్షకుల ఆదరణ పొంది.. బ్లాక్ బస్టర్ సాధించిన టాలీవుడ్ మూవీ క్షణం. డార్క్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అన్ని భాషల నుంచి రీమేక్ ఎంక్వైరీలతో పాటు పలు ప్రాజెక్టుల అనౌన్స్ మెంట్స్ కూడా వచ్చాయి. అయితే.. క్షణం హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు అడివి శేష్.

ఇప్పుడీ బాలీవుడ్ ప్రాజెక్టు అడివి శేష్ చేజారిపోయిందనే విషయం ఖాయమైపోయింది. నిర్మాత సాజిద్ నదియావాలా.. క్షణం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అడివి శేష్ చేతికే వస్తుందని అంతా భావించారు కానీ.. బాఘీ2 పేరుతో రీమేక్ చేస్తున్నట్లు కన్ఫాం చేసేశారు. దీంతో లవర్ కోసం ఇండియాకి తిరిగొచ్చిన ఎన్నారై పాత్రలో టైగర్ ష్రాఫ్ నటించనున్నాడనే సంగతి తేలిపోయింది. ఈ విషయం తెలిసి నిరుత్సాపడిన అడివి శేష్.. ఇప్పుడా సంగతులు పక్కన పెట్టేసి తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టేశాడు. హిందీలో టైగర్ ష్రాఫ్ కు బాగా క్రేజ్ ఉండడంతో.. ఈ ప్రాజెక్టు అతను బాగా సూట్ అవుతాడన్న అడివి శేష్.. తను ఇప్పటివరకూ సౌత్ పరిమితం కావడంతోనే ఇలా జరిగి ఉంటుందని అన్నాడు.

ప్రస్తుతం తను నటిస్తున్న గూఢచారి చిత్రం సూపర్బ్ గా వస్తోందని.. క్షణంను మించి జనాలను మెప్పిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్న అడివి శేష్.. తను ఇప్పటివరకూ చేయని ఓ కొత్త జోనర్ లో ఈ సినిమా ఉంటుందని.. బిగ్ స్కేల్ పై తెరకెక్కిస్తుండడంతో టెక్నికల్ వాల్యూస్ క్షణం కంటే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాడు అడివి శేష్.
Tags:    

Similar News