అక్కడ ఇక్కడ పెంచేసిన అడవి శేష్‌

Update: 2022-12-28 23:30 GMT
యంగ్‌ అండ్ ట్యాలెంటెడ్‌ హీరో అడవి శేష్‌ వరుసగా సక్సెస్‌ లతో దూసుకు పోతున్నాడు. ఈ ఏడాది మేజర్ మరియు హిట్‌ 2 లతో హిట్ హీరోల జాబితాలో చేరాడు. యూఎస్ లో ఈయనకు ఉన్న ఫాలోయింగ్‌ తో అక్కడ ప్రతి సినిమా కూడా మినిమం గా వసూళ్లు రాబడుతూ ఉంది. అత్యధిక మిలియన్ డాలర్ల సినిమాలను కలిగిన యంగ్‌ హీరోగా అడవి శేష్‌ నిలిచాడు.

మేజర్ తర్వాత హిట్‌ 2 విజయాన్ని సొంతం చేసుకోవడంతో అడవి శేష్‌ క్రేజ్ మరింతగా పెరిగింది. పెరిగిన క్రేజ్ కు తగ్గట్లుగా తన పారితోషికం ను పెంచేసినట్లుగా తెలుస్తోంది.

అడవి శేష్‌ తాజాగా ఒక సంస్థ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా చేసేందుకు సైన్‌ చేశాడట. అందుకు గాను భారీ పారితోషికం ను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 50 లక్షల రూపాయలను వారు అడవి శేష్‌ కు పారితోషికంగా ఇచ్చారని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఏ యంగ్‌ హీరో కూడా ఈ స్థాయిలో బ్రాండ్‌ అంబాసిడర్ గా చేసినందుకు గాను పారితోషికం తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

కేవలం బ్రాండ్‌ అంబాసిడర్ గా చేసినందుకు మాత్రమే కాకుండా సినిమాల్లో నటించేందుకు కూడా తన పారితోషికంను పెంచేశాడట. మేజర్.. హిట్‌ 2 సినిమాలకు తీసుకున్న పారితోషికంకు దాదాపుగా రెట్టింపు రెమ్యూనరేషన్‌ ను ఆయనకు నిర్మాతలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. మొత్తానికి అడవి శేష్‌ కు 2022 బాగా కలిసి వచ్చ అక్కడ ఇక్కడ భారీగా రెమ్యూనరేషన్ పెరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News