తెలుగులో ‘కర్మ’ చిత్రంతో హీరోగా - దర్శకుడిగా ఒకేసారి పరిచయం అయిన అడవి శేషు కెరీర్ ఆరంభంలో కాస్త తడబాటుకు గురయ్యాడు. అయితే ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. దర్శకుడిగా చేసిన రెండు ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లను అంటున్నాడు. అయితే రచయితగా మాత్రం కొనసాగుతాను అంటూ చెబుతున్న అడవి శేషు ఇటీవల ‘క్షణం’ మరియు ‘గూఢచారి’ చిత్రాలతో సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఆ రెండు చిత్రాలకు కూడా అడవి శేషు స్క్రిప్ట్ ను అందించిన నేపథ్యంలో ఇతడిలో మంచి రచయిత దాగి ఉన్నాడు అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.
బాలీవుడ్ లో ‘క్షణం’ రీమేక్ అవ్వడంతో అడవి శేషు ప్రతిభ అక్కడి వరకు వెళ్లింది. దాంతో ఈయన స్క్రిప్ట్ ను హిందీ ఫిల్మ్ కోరుకుంటున్నారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు అడవి శేషు ఒక దేశభక్తి కథాంశంను చెప్పాడట, వారు వెంటనే ఓకే చెప్పి చిత్రం నిర్మాణంకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. బాలీవుడ్ లో రచయితగా గుర్తింపు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. హిందీలో రచయితగా అరంగేట్రం చేసి అడవి శేషు అక్కడ డైరెక్టర్ గా సెటిల్ అవ్వొచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
2008లో తాను రాసుకున్న కథను తాజాగా బాలీవుడ్ నిర్మాతకు వినిపించానని - ఆ దేశ భక్తి కథ ఆయనకు నచ్చడంతో వెంటనే నిర్మాణంకు సిద్దం అయినట్లుగా అడవి శేషు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తూ - మరో వైపు రచయితగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈయన స్క్రిప్ట్ లు హిందీ ప్రేక్షకులను మెప్పిస్తాయా చూడాలి.