ఈమధ్య మన టాలీవుడ్ సినిమాల రేంజ్ పెరుగుతోంది.. సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా తెలుగు సినిమాలకు ఆదరణ దక్కుతోంది. అంతటితో ఆగకుండా విదేశాలలో కూడా తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి.. విదేశీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 'బాహుబలి' లో నటించిన కీలక పాత్రధారులకు జపాన్ లాంటి దేశాలలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. హీరో ప్రభాస్ మాత్రమే కాకుండా రానా దగ్గుబాటి.. సుబ్బరాజుపై కూడా జపాన్ వాసులు తమ ప్రేమను అభిమానాన్ని కురిపించారు.
ఇక తాజాగా అడివి శేష్ విషయంలో ఇలాంటిదే రిపీట్ అయింది. అడివి శేష్ కొత్త సినిమా 'ఎవరు' ను చూసిన ఒక జపనీయురాలు ఏకంగా ఇండియాకు వచ్చింది. ఈ విషయాన్ని శేష్ తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలుపుతూ "రీనా నా సినిమాను జపాన్ లో చూసిందట. 'ఎవరు' సినిమాను మరోసారి చూడడానికి అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చింది. నా టీమ్ ద్వారా ఈ విషయం తెలియడంతో తనతో కలిసి లంచ్ చేయడం జరిగింది. నా ఫ్రెండ్స్ ను కొంతమంది ని పరిచయం కూడా చేశాను. ప్రతి ఆర్టిస్టుకు ఏదో ఒక సమయంలో నిరాశ తప్పదు. అలాంటి సమయంలో రీనా.. అకికో లాంటి వ్యక్తుల అభిమానమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది" అంటూ ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. రీనాను కలిసిన సమయంలో 'మేజర్' టీమ్ తో ఉన్నానని ఈ వీడియోలో ఉన్న వ్యక్తి డైరెక్టర్ శశి అని.. 'ఎవరు' డైరెక్టర్ రాంజీ గారు అని కన్ఫ్యూజ్ కావద్దని ఒక నోట్ కూడా పెట్టాడు.
దీన్ని బట్టి అర్థం అయ్యేదేంటంటే మన తెలుగు సినిమాల కంటెంట్ మంచిదైతే జపాన్ లాంటి దేశాల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల ఉండే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే తెలుగు ప్రేక్షకులే రిజెక్ట్ చేస్తారు! ఇక ఆలస్యం ఎందుకు శేష్ గారి జపనీస్ ఫ్యాన్.. వీడియోను చూసేయండి.
వీడియో కోసం క్లిక్ చేయండి