ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, హీరోగా ఎదిగినవారిలో అడివి శేషు ఒకరుగా కనిపిస్తారు. చిన్నచిన్న వేషాలను వేస్తూ తన కెరియర్ ను ప్రారంభించిన ఆయన, 'క్షణం' .. 'గూఢచారి' సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'మేజర్' సినిమా జూన్ 3వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నాడు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నాడు.
"మా నాన్నగారివాళ్లది పాలకొల్లు .. భీమవరం వైపు. మా అమ్మగారి వాళ్లది నల్గొండ వైపు. నేను పుట్టింది హైదరాబాదులోనే .. పెరిగిందంతా అమెరికాలోనే. మా నాన్నగారికి సినిమాల్లోకి రావాలని ఉండేదికానీ కుదరలేదు. నేను హీరోను అయినందుకు ఆయన చాలా సంతోషపడ్డారు.
నేను ఇండస్ట్రీకి రావడానికి మా పేరెంట్స్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ నా వెనుక ఎవరూ లేరు .. కానీ ఆ తరువాత అందరూ కూడా నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. నీ వెనుక మేము ఉన్నాము అంటూ నా భుజం తట్టారు.
'క్షణం' సినిమా బాగుందనగానే అల్లు అర్జున్ పెద్ద ట్వీట్ చేశారు. అప్పటివరకూ ఆయన తన సినిమాలకి సంబంధించిన ట్వీట్స్ మాత్రమే చేసేవారు. ఫస్టు టైమ్ ఆయన నా సినిమాను గురించి ట్వీట్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. 'పంజా' సినిమాలో కో డైరెక్టర్ వచ్చి .. 'కొంచెం ఎక్కువగా చేస్తున్నావ్ .. హీరో కంటే ఎక్కువైపోతోంది చూస్కో' .. అని చెప్పినప్పుడు, పవన్ కల్యాణ్ గారు అడ్డుపడ్డారు. తాను ఎలా చేయాలనుకుంటున్నాడో అలా చేయని అని ఆ కో డైరెక్టర్ తో చెప్పారు. అలా అక్కడ ఆయన నన్ను సపోర్టు చేశారు.
మా ఫ్యామిలీ పెద్ద అడివి బాపిరాజుగారి రచనలను గురించి పవన్ సార్ నాతో చర్చించేవారు. 'బాహుబలి' సెట్లో నేను ఏం చేస్తున్నా దగ్గరుండి పట్టించుకుని చూసుకున్నది ప్రభాస్ గారే. ఇక నన్ను నమ్మి నాతో మహేశ్ బాబుగారు 'మేజర్' సినిమాను నిర్మించారు. ఇలా ఎంతోమంది స్టార్స్ నన్ను ఎంతో అభిమానంతో చూసుకున్నారు.
అందరూ కలిసి నన్ను ఇలా పైకి లేపారు. నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు .. కానీ సినిమాలకి సంబంధించినవారు ఎవరూ తెలియదు. అయినా ఈ రోజున ఈ స్థాయికి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.