హాలీవుడ్ సంస్థ‌లో అడ‌వి శేషు.. ముందున్న‌వ‌న్నీ పాన్ ఇండియా చిత్రాలే!

Update: 2022-12-02 09:35 GMT
'మేజ‌ర్' హిట్ తో యంగ్ హీరో అడ‌వి శేష్ పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యాడు. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ ముంబై ఎటాక్స్ ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన  చిత్రం కావ‌డంతోనే శేషు కి ఆ ర‌క‌మైన గుర్తింపు ద‌క్కింది. 'మేజ‌ర్' పాత్ర‌లో ఒదిగిపోయిన వైనం...మేకింగ్ స‌హా ప్ర‌తీది అగ్ర స్థానంలో నిల‌బెట్టాయి. వీట‌న్నింటికి మించి   శేషు లో యూనిక్ నెస్ అత‌న్ని ఆస్థానానికి తీసుకెళ్లింద‌ని చెప్పొచ్చు.

వైవిథ్య‌మైన క‌థ‌ల ఎంపిక‌...రైటింగ్ పై ప‌ట్టు...మేకింగ్ పై ఇంటెన్స్ అన్ని అత‌న్ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నాయి. ఈనేప‌థ్యంలో తాజాగా యంగ్ హీరో ఏకంగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేసాడు.   అలాగ‌ని శేషు హాలీవుడ్ కి వెళ్లిపోవ‌డం లేదు. ఇంగ్లీష్ సినిమాలు తీసేయ‌డం లేదు.

హాలీవుడ్ సంస్థ నిర్మిస్తున్న తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు. అత‌ని ట్యాలెంట్ మెచ్చి సద‌రు సంస్థ ఈ అవ‌కాశం క‌ల్పించింది. ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు?  ఎలాంటి క‌థ అన్న అంశాలు మాత్రం రివీల్ చేయ‌లేదు. హాలీవుడ్ సంస్థ నిర్మిస్తుంది. అంటే ఆ క‌థ యూనిక్ గానే ఉంటుంది. ఇది ఓ విదేశీ చిత్రంగా తెలుస్తోంది. మాతృక‌లో ఈ చిత్రాన్ని  ఇదే సంస్థ నిర్మించింది.

తెలుగులో  స‌క్సెస్ అవ్వ‌డానికి ఛాన్సెస్ ఉండ‌టంతో శేషుని హీరోగా నియ‌మించుకుని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియాలో ఆ సినిమా రిలీజ్ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది.  అలాగే అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఓ పాన్ ఇండియా చిత్రం కూడా చేస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే ఓ ఆస్కార్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

గుఢచారి క‌థ కూడా రెడీ అవుతుంది. మూల క‌థ కుదిరింది. దాన్ని పూర్తి స్థాయిలో సిద్దం చేయాల‌ని తెలిపారు.  మొత్తానికి శేషు ముందున్న‌వ‌న్ని పెద్ద చిత్రాలే. అన్ని యూనివ‌ర్శ్ అప్పీల్  ఉన్న క‌థ‌లే.   పాన్ ఇండియాలో ఫేమ‌స్ అవ్వ‌డానికి దోహదం చేసే క‌థ‌లుగానే తెలుస్తోంది. మ‌రి అవ‌న్నీ మొద‌లై రిలీజ్ అయితే త‌ప్ప‌!  క్లారిటీ రాదు. నేడు ఆయ‌న హీరోగా న‌టించిన 'హిట్ -2' ప్రేక్ష‌కుల ముంద‌కొచ్చిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News