ఆ దర్శకుడికి అడ్వాన్స్‌ రూ.100 మాత్రమే

Update: 2021-07-03 03:10 GMT
మేము వయసుకు వచ్చాం సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన త్రినాధ రావు నక్కిన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ సినిమా కమర్షియల్‌ గా సక్సెస్‌ ను దక్కించుకుంది. అయితే ఆ వెంట వెంటనే రెండు సినిమా లు ప్రియతమా నీవచట కుశలమా మరియు నువ్వలా నేనిలా సినిమాలను తెరకెక్కించి బొక్క బోర్లా పడ్డాడు. ఆ సినిమా లు రెండు ప్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ వచ్చింది. నాల్గవ సినిమా ను రాజ్‌ తరుణ్‌ తో సినిమా చూపిస్తా మావ అంటూ తెరకెక్కించి మాస్ ఆడియన్స్ ను అలరించాడు. ఇండస్ట్రీ దృష్టిని కూడా ఆకర్షించడంతో పాటు మంచి ఆఫర్లను దక్కించుకున్నాడు. రాజ్‌ తరుణ్‌ కు ఆ సినిమా తో సక్సెస్ ను ఇవ్వడంతో పాటు తాను కూడా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో నిలదొక్కకున్నాడు.

వరుసగా బిగ్గెస్ట్‌ సినిమా లను చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. సినిమా చూపిస్తా మావ సినిమా తర్వాత నాని హీరోగా దిల్‌ రాజు నిర్మాణంలో నేను లోకల్‌ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వెను దిరిగి చూసుకోకుండా ఏడాదికి ఒక సినిమా చొప్పున చేస్తూనే ఉన్నాడు. హలో గురు ప్రేమ కోసమే చిత్రంతో రామ్‌ కు కూడా సక్సెస్ అందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్‌ లో పెట్టాడట. ఈయన వరుసగా పెద్ద హీరోలతో కూడా సినిమా లు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలో ఈయన సినిమాలు కమిట్‌ అయ్యే విధానం గురించి మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈయన నిర్మాతల నుండి కేవలం వంద రూపాయలను అడ్వాన్స్ గా తీసుకుంటాడట.

దర్శకులు హీరోలు లక్షలు కోట్లల్లో అడ్వాన్స్ లు గా పుచ్చుకుంటూ ఉంటారు. కాని ఈయన మాత్రం కేవలం వంద రూపాయలు మాత్రమే అడ్వాన్స్ గా తీసుకుంటాడు. కథ ఓకే కాకుండానే ఈయన కు సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఈయన నిర్మాతలకు నమ్మకం కలిగించేందుకు అని వంద రూపాయలు మాత్రమే అడ్వాన్స్ గా తీసుకుంటాడట. ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా కూడా నిజమే అంటూ ఆయన సన్నిహితులు కూడా అంటూ ఉన్నారు.

హీరోల నుండి ఆఫర్లు వచ్చినా కూడా ఈయన మాత్రం కథ సెట్‌ అయితేనే వారితో సినిమాలకు కమిట్ మెంట్‌ ఇస్తాడు. అంతే తప్ప ఎలాగూ వారు డేట్లు ఇచ్చారు కదా అని సినిమాను ప్రకటించడట. ఈ విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉంటాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈయన తదుపరి సినిమా రవితేజ తో చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో మరో సినిమా ను ఆయన చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ తో పాటు వెంకటేష్ హీరోగా ఒక సినిమా ను మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్ లో ఒక సినిమా ను ఇంకా నాగశౌర్య తో ఒక సినిమా ను ఈయన చేయాల్సి ఉంది.

ఈ అన్ని సినిమాలకు కూడా ఆయన వంద రూపాయల అడ్వాన్స్ మాత్రమే తీసుకుని ఉంటాడని... కథ ఓకే అయ్యి సినిమా పట్టాలు ఎక్కిన తర్వాత పారితోషికంను తీసుకుంటాడని అంటున్నారు. దర్శకులందు త్రినాధ రావు నక్కిన శైలి వేరు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా కారణం వల్ల సినిమా చేయక పోయినా కూడా వందే అడ్వాన్స్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది ఆయన అభిప్రాయం అయ్యి ఉంటుంది. నిర్మాతలకు కూడా ఇది ఆర్థిక భారం కాదని అంటున్నారు.
Tags:    

Similar News