మణికర్ణిక నుండి మరొకరు అవుట్!

Update: 2018-09-29 13:33 GMT
'మణికర్ణిక' చుట్టూ నెలకొన్న హంగామా ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు.  మొదట్లో స్టోరీ విషయంలో జరిగిన రచ్చ తెలిసిందే.  ఆతర్వాత క్రిష్ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడం.. కొన్ని నెలల తర్వాత నటుడు సోనూ సూద్ బయటకు రావడం కూడా మీడియాలో హాట్ టాపిక్కులు అయ్యాయి. తాజాగా ఈ సినిమానుండి స్వాతి సెమ్వాల్ అనే నటి బయటకు వచ్చింది.

 'మణికర్ణిక' లో పార్వతి అనే పాత్రను స్వాతి సెమ్వాల్ పోషిస్తోంది. మరాఠా సైన్యాధిపతి అయిన సదాశివరావు భావూ భార్య పాత్ర అది.  సదాశివరావు భావూ పాత్రను మొదట్లో సోను సూద్ పోషించాడు కానీ సోనూ ఈ సినిమానుండి తప్పుకున్న తర్వాత జీషాన్ అయూబ్ ఆ పాత్రను పోషిస్తున్నాడు. సదాశివరావు పాత్రను కుదించడంతోనే సోనూ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. స్వాతి కూడా దాదాపు అదే రీజన్ చెప్పింది. "నేను సినిమా నుండి తప్పుకుంటున్నా.  నా పాత్రపై కొన్ని అనుమానాలు ఉన్నాయి.. ఈమధ్యే ఆ విషయంపై మీటింగ్ జరిగింది.. మీటింగ్ తర్వాత నా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని అర్థం చేసుకున్నాను. నేను ఈ సినిమాకు సైన్ చేసినప్పుడు ఇలా లేదు. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది."

సోనూ సూద్ బయటకు వచ్చాడు కాబట్టి మీరు కూడా బయటకు వచ్చారా అని అడిగితే "అలా అని కాదు. నేను ఏపాత్ర చేసినా.. అది చిన్నది అయిన కూడా ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉందా లేదా అని చూసుకుంటాను. 'బరేలీ కీ బర్ఫీ' కానివ్వండి లేదా 'ఫానీ ఖాన్' కానివ్వండి.. నా రోల్  కు ఇంపార్టెన్స్ ఉంటే నేను చేసేందుకు సిద్ధం. కానీ 'మణికర్ణిక' పాత్ర ఇప్పుడు అలా లేదు. అందరికీ సినిమాను హిట్ చేయాలనే ఉంటుంది... విజయం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  ఇక నా విషయనికి వస్తే బయటకు వచ్చినందుకు బాధ లేదు."

 ఈ సినిమాలో కంగనా లీడ్ రోల్ లో నటిస్తుండగా కమల్ జైన్ - జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు..  క్రిష్ సినిమా నుండి బయటకు వచ్చిన తర్వాత కంగనా దర్శకత్వ భాద్యతలు చేపట్టింది.  'మణికర్ణిక' 25 జనవరి 2019 న రిలీజ్ కానుంది.
Tags:    

Similar News