త‌మ‌న్నా త‌రువాత రానాకు అవార్డు

Update: 2018-04-20 07:22 GMT
ఈ ఏడాది రానాకి టైం చాలా బాగున్న‌ట్టుంది. మంచి గుర్తింపుతో పాటూ అవార్డుల మీద అవార్డులు వ‌రిస్తున్నాయ్‌. మొన్న‌నే ఆయ‌న చేసిన ఘాజీ జాతీయ అవార్డును గెలుచుకుంటే ఇప్పుడు రానాకు ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్యే ఎక్స్‌ లెన్స్ అవార్డు ద‌క్కింది. ఉత్త‌మ ద‌క్షిణాది తార‌గా రానా ఎంపిక‌య్యాడు. త‌మ‌న్నాకు కూడా బాహుబ‌లి మొద‌టి పార్ట్‌లో అవంతిక పాత్ర అద్బుతంగా చేసినందుకు  ఇదే  అవార్డుకు ఎంపిక చేశారు.

బాహుబ‌లి సినిమా కేవ‌లం తెలుగు చ‌ల‌న‌చిత్ర‌సీమ‌కే కాదు ఆ సినిమాలో చేసిన తార‌ల‌కూ అద్భుత‌మైన గుర్తింపు తెచ్చింది. విల‌న్‌ గా చేసిన రానాలో ఇంత మంచి ప్రతినాయ‌కుడు దాగి ఉన్న సంగ‌తి బాహుబ‌లి ద్వారానే మ‌న‌కు తెలిసింది. అలాగే రానా చేసిన ఘాజీ సినిమా సైలెంట్ హిట్ కొట్టి ఆ హీరోకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే ద‌క్షిణాదిలో ఇప్పుడు పేరున్న తార‌గా, బాహుబ‌లి రెండో పార్ట్‌ లో అత‌ని న‌ట‌ను మెచ్చుకుంటూ ఈ అవార్డుకు ఎంపిక‌చేశారు. త‌మ‌న్నా రానాల‌తో పాటుగా భూమి సినిమాకు గానూ అదితి రావ్ హైద‌రిని హిచ్‌ కి సినిమాకు గానూ రాణి ముఖ‌ర్జీని ఎంపిక చేశారు. అనుష్క శ‌ర్మ రాజ్ కుమార్ రావ్ కృతిస‌న‌న్ షాహిద్ కపూర్ ర‌ణ్‌ వీర్ సింగ్‌లు కూడా దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపిక‌య్యారు.

ఈ అవార్డుల‌ను ముంబైలో ఏప్రిల్ 21న జ‌రిగే అవార్డుల వేడుక‌లో విజేత‌ల‌కు అందిస్తారు. ఈ ఏడాది ప్ర‌క‌టించిన 65వ జాతీయ అవార్డుల‌లో కూడా మూడింటిని బాహుబలి సినిమా సొంతం చేసుకుంది. సినిమా విడుద‌లై నెల‌లు గ‌డుస్తున్నా... ఆ త‌రువాత వంద‌ల కొద్దీ సినిమాలు విడుద‌ల‌వుతున్నా బ‌హుబ‌లి స్థానాన్ని మాత్రం ఏ సినిమా భ‌ర్తీ చేయ‌లేక‌పోయింది. జ‌పాన్‌లో కూడా బాహుబ‌లి కాసుల వ‌ర్షం కురిపిస్తూ శ‌త‌దినోత్స‌వం వైపు ప‌రుగులు తీస్తోంది.
Tags:    

Similar News