గాలి వాలుగా అజ్ఞాతవాసి

Update: 2017-12-07 04:18 GMT
పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. అయినా సరే.. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి తెలుగు ఆడియన్స్ ఇంట్రెస్ట్ అంతా అజ్ఞాతవాసి చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించేయగా.. మూవీ నుంచి విడుదల చేసిన తొలి లిరికల్ సాంగ్ బయటకొచ్చి చూస్తేకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

అనిరుధ్ రవిచందర్ తొలిసారిగా తెలుగు సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం నుంచి ఈ కంపోజర్ అందించిన మరో పాటను విడుదల చేయనున్నారు. 'గాలి వాలుగా' అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. ఈ పాట విడుదల తేదీని ఇవాళే ప్రకటించనున్నారు. మ్యూజికల్ గా అజ్ఞాతవాసి మూవీ కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుందనే అంచనాలున్నాయి. మరోవైపు.. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేసేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రీసెంట్ గా హైద్రాబాద్ లోని పలు ప్రాంతాలలో కొన్ని సీన్స్ తో పాటు ప్యాచ్ వర్క్ కూడా ఫినిష్ చేసిన మాటల మాంత్రికుడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

అజ్ఞాతవాసి మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్న కీర్తి సురేష్.. అను ఇమాన్యుయేల్ తమ తమ పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెబుతుండడం విశేషం. జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కోసం అజ్ఞాతవాసి అన్నిరకాలుగాను ముస్తాబు అయిపోతోంది.
Tags:    

Similar News