అజ్ఞాతవాసి హంగామా షురు

Update: 2018-01-05 10:33 GMT
సమయం మరో ఐదు రోజుల కంటే తక్కువగా ఉంది. అజ్ఞాతవాసి రాక కోసం ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా క్రేజ్ మైంటైన్ చేస్తున్న పవర్ స్టార్ సినిమా హంగామా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి రెండు వారాలకు టికెట్ ధరలు పెంచుకునే విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈపాటికే కొన్ని సెంటర్స్ లో బుక్ మై షో - పేటీఎం ద్వారా టికెట్ అమ్మకాలు మొదలు పెట్టేసారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అందులో అధిక శాతం థియేటర్ బుకింగ్స్ కి టికెట్ ధర ఎంతనో ప్రస్తావించకుండా సీట్ కన్ఫర్మేషన్ కోసం కేవలం రిజర్వేషన్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. మరి షో టైం కి అక్కడికి వెళ్ళాక ఫస్ట్ క్లాస్ కనీస ధర 200 రూపాయలు ఉండొచ్చు అనేది అంచనా. ఒంగోలు లాంటి కొన్ని చోట్ల మాత్రమే 200 ధర నిర్ణయించి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. మరో రెండు రోజులు ఆగితే అన్ని థియేటర్ల బుకింగ్ మొదలవుతుంది కాబట్టి అప్పుడు స్పష్టత రావొచ్చు.
 
జనవరి 5న విడుదల చేస్తామన్న ట్రైలర్ కూడా ఇంకా ఇప్పటి దాకా విడుదల కాలేదు. సాధారణంగా ఉదయం 10 లేదా సాయత్రం 5 లేదా 6 కు రిలీజ్ చేయటం కామన్. కాని ఉదయం నుంచి ఆ జాడలేమీ కనిపించడం లేదు. ఫ్రెంచ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారని ఇప్పటికే రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రైలర్ ని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసి వదలాలని నిర్ణయించుకున్నట్టు టాక్. ఈ వివాదం గురించి మీడియా రకరకాల వార్తలు ప్రసారం కావడంతో అలెర్ట్ అయిన యూనిట్ అనవసరమైన పోలీకలు రాకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు  సమాచారం. పవన్ ఫాన్స్ మాత్రం విడుదల ఐదు రోజులే ఉన్నా కూడా ఇప్పటి దాకా ట్రైలర్ విడుదల చేయకపోవడం పట్ల అసహనంతో ఉన్నారు. మరి వీటికి చెక్ పెడుతూ సాయంత్రం విడుదల చేస్తారో లేక మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News