మారుతికి 'ఆహా' అడ్వాన్స్‌

Update: 2021-05-16 05:10 GMT
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో మొదలైన ఆహా మెల్ల మెల్లగా కంటెంట్‌ మరియు క్వాలిటీని పెంచుతూ వస్తోంది. ఆరంభంలో కంటెంట్‌ విషయంలో మరీ లో క్వాలిటీ మెయింటెన్‌ చేయడంతో పాటు పాత సినిమా ల విషయంలో కూడా నిరాశ పర్చే విధంగా ఉందంటూ విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది లాక్ డౌన్ తర్వాత మెల్ల మెల్లగా ఆహా లో కంటెంట్‌ పెంచుతూ వస్తున్నారు. చిన్న పెద్ద సినిమాలతో పాటు టాక్ షో లు వెబ్‌ సిరీస్ లతో ఆహా ను నింపేస్తున్నారు. ప్రేక్షకులను రెగ్యులర్ గా ఏదో ఒక కంటెంట్‌ తో ఎంటర్‌ టైన్‌ చేస్తున్న ఆహా వారు మరిన్ని వెబ్‌ సిరీస్ లు మరియు వెబ్‌ మూవీస్ ను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యింది.

ఆహా వారు ఒరిజినల్‌ కంటెంట్‌ పై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఇతర నిర్మాతలు నిర్మించిన కంటెంట్‌ ను కొనుగోలు చేసిన ఆహా ప్రస్తుతం సొంతంగా కంటెంట్‌ ను నిర్మించేందుకు సిద్దం అయ్యింది. పలువురు యంగ్‌ దర్శకులతో పాటు కొత్త దర్శకులను మరియు సీనియర్ దర్శకులను కూడా వెబ్‌ సిరీస్ లు మరియు వెబ్‌ మూవీస్ కోసం సంప్రదిస్తున్నారట. తక్కువ బడ్జెట్‌ లో మంచి క్వాలిటీ కంటెంట్‌ ను కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమా లను నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్‌ చేస్తున్నాడట. అందులో భాగంగానే మారుతితో రెండు ప్రాజెక్ట్‌ లకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.

ప్రస్తుతం గోపీచంద్‌ తో పక్కా కమర్షియల్‌ సినిమా ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న మారుతి ఇప్పటికే రెండు చిన్న బడ్జెట్‌ వెబ్‌ మూవీస్ ను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడట. ఆ రెండు సినిమాలను కూడా మూడు నుండి నాలుగు కోట్ల లోపు బడ్జెట్‌ లోనే పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అల్లు అరవింద్‌ ఫ్యామిలీకి మారుతి సన్నిహితంగా ఉంటాడు. అల్లు అర్జున్‌ కు మారుతి మంచి మిత్రుడనే విషయం తెల్సిందే. ఆ కారణంగానే ఆహా కోసం మారుతి వర్క్ చేసేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది.
Tags:    

Similar News