నవీన్ చంద్ర.. సలోని లుథ్ర జంటగా తెరకెక్కిన ‘భానుమతి రామకృష్ణ’ చిత్రం డిజిటల్ లో విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్దం అయ్యారు. విడుదల ముంగిట ఉన్న సమయంలో కోర్టు చిత్ర యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చింది. సీనియర్ హీరోయిన్ భానుమతి రామకృష్ణ తనయుడు చెన్నై హైకోర్టులో తన తల్లి పేరుతో సినిమాను తెరకెక్కించారు అందుకు మా అనుమతి తీసుకోలేదు అంటూ పిటీషన్ వేయడం జరిగింది.
నిర్మాతలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. సినిమా టైటిల్ మార్చాల్సిందే అంటూ కోర్టు సూచించడంతో నిర్మాతలు టైటిల్ మార్చారు. భానుమతి రామకృష్ణ అంటూ ఉన్న టైటిల్ ను భానుమతి అండ్ రామకృష్ణ గా మార్చారు. కేవలం అండ్ ఒక్కటి జత చేసి కొత్త పోస్టర్స్ ను విడుదల చేశారు. కనుక కోర్టు నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. సినిమా థియేటర్లలో విడుదల కాదు కనుక అనుకున్న సమయంకు విడుదల అవుతుందా లేదా అనే సందేహం లేదు. ఆహాలో అనుకున్న సమయంకు అంటే రేపటి నుండి భానుమతి అండ్ రామకృష్ణ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.