త‌మిళ్ లో 'ఆహా'..మెగా నిర్మాత మాస్ట‌ర్ ప్లాన్!

Update: 2022-04-15 04:30 GMT
మెగా నిర్మాత అల్లు అర‌వింద్ తీసుకొచ్చిన `ఆహా` తెలుగు వెర్ష‌న్  స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన‌తి కాలంలోనే టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు `ఆహా` చేరువైంది. సినిమాలతో పాటు..వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ఔత్సాహికుల్ని ప‌రిచయం చేయ‌డంలో ఆహా కీల‌క పాత్ర పోషించింది. క్వాలిటీ కంటెంట్ అందించ‌డంలో `ఆహా` ది బెస్ట్ అని నిరూపించింది.

నెట్ ప్లిక్..అమెజాన్ ప్రైమ్ లాంటి కార్పోరేట్ కంపెనీల‌కు ధీటుగా `ఆహా` మార్కెట్ లో  నిల‌బ‌డింది. `ఆహా 2.0` తో చేసిన  మేజిక్స్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. న‌ట‌సింహ బాల‌కృష్ణ ఎంట్రీతో `ఆహా` మ‌రింత ఫేమ‌స్ అయింది. బాల‌య్య మార్క్ సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూల‌తో  దేశ వ్యాప్తంగా బాగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంకా ఆహాని పెద్ద ఎత్తుకు తీసుకెళ్లాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు.

వినూత్న ప్రోగ్రామ్ లు..యూనిక్ వెబ్ సిరీస్ లు నిర్మించి `ఆహా`ని దేశంలోనే ఓ బ్రాండ్ గా నిల‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇక అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు `ఆహా`ని వీలైనంత చేరువ చేయాల‌ని మ‌రోవైపు అంతే సీరియ‌స్ గాప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగా  తాజాగా `ఆహా` తమిళ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.  తమిళ్ కంటెంట్‌తో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.  తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ `ఆహా` తమిళ్ ఓటీటీని లాంఛనంగా ప్రారంభించారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ చేతుల మీదుగా ఆహా తమిళ్ ఓటీటీని లాంఛ్ చేశారు.

న‌టుడు శింబు.. సంగీత ద‌ర్శ‌కుడు  అనిరుధ్ పాల్గొన్నారు.  వీరిద్ద‌రు `ఆహా` తమిళ్ వెర్ష‌న్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. త‌మిళ టీమ్ని  అభినందిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసంద‌ర్భంగా అంద‌రికీ  విషెస్ తెలియ‌జేసారు. మొత్తానికి ఆహా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.  

రామ్ చ‌ర‌ణ్‌..అల్లు అర్జున్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్లుగా అవ‌త‌రించారు. ఇంకా మ‌రింత‌మంది మెగా హీరోలు ఆర‌కమైన ప్ర‌యాణానికి సిద్దం అవుతున్నారు. డే బై డే తెలుగు హీరోల మార్కెట్ విస్త‌రిస్తుంది. తెలుగు సినిమాలు వంద‌ల కోట్లు వ‌సూళ్లు సాధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో `ఆహా` లాంటి సొంత  ఓటీటీలు ఉంటే ప్ర‌మోట్ చేసుకునే అవ‌కాశం వీజీగా ఉంటుంది.

బాలీవుడ్ హీరోలే సౌత్ కంటెంట్ వైపు చూస్తున్నారు. ద‌క్షిణాదిలోనూ త‌మ సినిమా మార్కెట్ ని బిల్డ్ చేసుకోవాల‌ని చూస్తున్నారు. అందులో ఇలాంటి మాధ్య‌మాలు ఎంతో  కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది.  ఇలా ఎన్నో లెక్కల ప్ర‌కారం `ఆహా`ని లాంచ్ చేయ‌డం వెనుక ఓ కార‌ణంగా క‌నిపిస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News