ఆహా' vs 'అమెజాన్ ప్రైమ్' రేసుకి ద‌గ్గ‌ర్లో కూడా లేని మిగ‌తా ఓటీటీలు..!

Update: 2020-11-20 02:30 GMT
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీల హడావిడి ఎక్కువైంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని అందిస్తూ ఓవర్ ది టాప్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీలని ఏటీటీ లనీ అనేక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చాయి. అప్పటికే నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - సన్ నెక్స్ట్ వంటి ఓటీటీలు సత్తా చాటుతున్నాయి. ఇదే క్రమంలో 100 శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది 'ఆహా'. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సారధ్యంలోని ఈ ఓటీటీ అనతికాలంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. థియేటర్స్ మూతబడటంతో 'ఆహా'లో ఎంటర్టైన్మెంట్ కోసం డ‌బ్బింగ్ సినిమాలు.. ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. లోక‌ల్ తెలుగు ఫీలింగ్.. చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొట్టడం.. పలువురు స్టార్ల స‌పోర్ట్.. ఇలా అనేక మార్గాల్లో 'ఆహా' తెలుగు ప్రేక్ష‌కుల‌కి బాగా ద‌గ్గ‌ర‌వుతోంది.

మరోవైపు తెలుగు కంటెంట్ విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తిరిగి పుంజుకుంది. ఇటీవల ఆడియన్స్ కి బెస్ట్ కంటెంట్ ఇవ్వడంలో కాస్త వెనుకబడిన అమెజాన్ ప్రైమ్.. 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. అందులోనూ వ‌న్ ఇయ‌న్ ఫ్రీ అనే మార్కెంటింగ్ స్టాట‌జీ అమెజాన్ ప్రైమ్ ని తెలుగు వారికి ద‌గ్గ‌ర చేసింది. ప్రస్తుతం తెలుగు కంటెంట్ ని అందిస్తున్న ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ తో పోటీ ప‌డుతున్న ఏకైక యాప్ 'ఆహా' మాత్ర‌మే అని చెప్పవచ్చు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ పేరు తెచ్చుకున్నప్పటికీ సబ్ స్క్రిప్షన్ ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు 'ఆహా' మరియు అమెజాన్ ప్రైమ్ కి పోటీగా ఎరోస్ వారు కూడా ఓటీటీ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతోందట. మరి రాబోయే రోజుల్లో తెలుగు ఆడియన్స్ ఏయే ఓటీటీలను ఆదరిస్తారో చూడాలి.


Tags:    

Similar News