మళయాళంలో తన నటతో మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య లక్ష్మి ఈమధ్య తమిళ సినిమాల్లో కూడా సందడి చేస్తుంది. తెలుగులో గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఐశ్వర్య లక్ష్మి. రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాతో కూడా అమ్మడు ఆకట్టుకుంది. సినిమాలో తన పోర్షన్ వరకు అదరగొట్టేసింది ఐశ్వర్య. సినిమాలే కాదు ఓటీటీ వెబ్ సీరీస్ లతో కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది అమ్మడు.
ఇటీవలే అమ్ము అంటూ ఓ తెలుగు వెబ్ సీరీస్ తో వచ్చిన ఐశ్వర్య లక్ష్మి ఆ సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మరో మూవీతో వస్తుంది ఐశ్వర్య. ఈసారి కుమారి అంటూ ఒక మైథలాజికల్ ఫాంటసీ మూవీతో వస్తుంది. ఈ మూవీని నిర్మల్ సహదేవ్ డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా నవంబర్ 18 శుక్రవారం రిలీజ్ అవుతుంది. అమ్ము సినిమాతో ఒక ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిన ఐశ్వర్య లక్ష్మి కుమారితో కూడా అలరిస్తుందని అంటున్నారు.
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న కుమారి మూవీ టీజర్, ట్రైలర్ ఈ సీరీస్ పై ఆసక్తి కలిగించాయి. థియేటర్ లోనే వస్తేనే కాదు తమకు నచ్చిన కంటెంట్ ఎక్కడ రిలీజైనా సరే చూసేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్లు పెరగడం.. అంత ఖర్చు పెట్టి సినిమా చూసినా నిరాశపరచడం లాంటి కారణాల వల్ల థియేటర్ లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపట్లేదు. అందుకే ఓటీటీలకు ఎక్కువ డిమాండ్ పెరిగింది.
భాషతో సంబంధం లేకుండా ఓటీటీ లో వెరైటీ కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు విరగబడి చూసేస్తున్నారు. వెండితెర మీద అద్భుతాలు చేయాలని అనుకున్న ఔత్సాహిక కళాకారులకు కూడా ఈ ఓటీటీల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఈమధ్య ఓటీటీల్లో మంచి మంచి కంటెంట్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల సినిమాలు, వెబ్ సీరీస్ లు కూడా మన ప్రేక్షకులు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.