కంగారూలు విచిత్రమైన జంతువులు. తమ పొట్టకు దిగువన ఉన్న సంచిలో అవి బిడ్డల్ని దాచుకుంటాయి. ఎక్కడా విడిచిపెట్టకుండా ప్రేమగా, లాలనగా చూసుకుంటాయి. ప్రస్తుతం అదే తీరుగా తన బిడ్డ ఆరాధ్యను దాచేసుకుంటోంది ఐశ్వర్యారాయ్. కేన్స్ ఫిలింఫెస్టివల్‌లో కెమెరా ఫ్లాష్‌లు సుకుమారమైన తన బిడ్డకు చటుక్కున తగలకుండా ఆరాధ్య చుట్టూ వలయంలా చుట్టేస్తోంది. ఫోటోగ్రాఫర్లు మీద పడుతున్నా తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తోంది. ఈ సంగతిని తనే స్వయంగా చెప్పుకుంది ఐష్.
కేన్స్ విమానాశ్రయంలో దిగినప్పుడు, తనకి బస ఏర్పాటు చేసిన చోట ఒకటే మీడియా హడావుడి. వీళ్లంతా తనతో పాటు తన బిడ్డ ఫోటోగ్రాఫ్‌లను కూడా తీయాలని సంబరపడిపోవడం తనకి ఎన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతోంది.
ఐష్ కేన్స్‌లో ర్యాంప్ వాక్‌లతో అదరగొట్టేయడమే కాదు.. తన రీఎంట్రీ సినిమా జజ్బాకి ప్రచారం కూడా చేసుకుంటోంది. అయితే జనాలంతా ఇదే రీఎంట్రీ సినిమా అని అంటుంటే కాకూడదని ఖండిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలోని సినిమానే రీఎంట్రీ సినిమా కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అది చాలా బలమైన కథ అని తన గురువుగారి మీద అభిమానాన్ని చూపెట్టింది.
అలాగే కరణ్‌జోహార్ దర్శకత్వంలో ఏ దివానీ ముష్కిల్ చిత్రంలోనూ నటిస్తున్నానని చెప్పింది. గతంలో కరణ్ దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాల్లో అవకాశం వచ్చినా నటించలేకపోవడానికి కారణం నిరంతరం నాలుగేసి సినిమాలతో బిజీగా ఉండడమేనని చెప్పింది.