ప్ర‌పంచసుంద‌రి వ‌య‌సై పోయింది!

Update: 2019-01-04 05:14 GMT
ప్ర‌పంచ సుంద‌రి వ‌య‌సైపోయింది. 60 ప్ల‌స్ భామ్మ‌లా క‌నిపిస్తోంది. అవునా.. ఇది నిజ‌మా? అంటే ఇదిగో ఇదే ప్రూఫ్‌. ఇన్నాళ్లు మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ అంద‌చందాల గురించి పొగిడిన వాళ్లు ఇక‌ పై యూట‌ర్న్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే త‌న వ‌య‌సు ఇప్ప‌టికే 45ప్ల‌స్. 1973 న‌వంబ‌ర్ 1 ఐష్ పుట్టిన‌తేదీ. అందుకే ఇప్పుడు ఆ ఛాయ‌లు త‌న‌లో స్ప‌ష్టంగా క‌నిపించేస్తున్నాయ్.

ఇన్నాళ్లు మేక‌ప్ జిగిబిగిలో.. ఇంకేదో మాయ‌లో ప‌డి వ‌య‌సును అభిమానులు ప‌ట్టించుకోలేదు కానీ, ఐష్ ఏజ్ బార్ ల‌క్ష‌ణాలు ఇదిగో ఇలా బ‌య‌ట‌పడిపోతున్నాయ్. అస‌లు మేక‌ప్ లేక‌పోతే తెలిసిపోతుందిలా. ముఖంలో మునుప‌టి ఛామ్ మిస్స‌య్యింది. పైగా క‌ళ్ల కింద వ‌ల‌యాలు.. ముడుత‌లు క‌నిపిస్తున్నాయ్. అయితే వ‌య‌సుతో పాటే ఇవ‌న్నీ క‌నిపించ‌డం మామూలే అనుకుంటున్నా, ఐశ్వ‌ర్యారాయ్ ని ఇంకా త‌మ ఆరాధ్య దేవ‌త‌గా, క‌ల‌ల రాణిగా ఊహించుకునే వారికి ఇది అంత తేలిగ్గా డైజెస్ట్ కావ‌డం క‌ష్టమే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ద‌శాబ్ధాల పాటు ఈ సువిశాల ప్ర‌పంచాన్ని మ‌హారాణిలా ఏలిన ఐశ్వ‌ర్యారాయ్‌.. పెళ్ల‌యి ఒక బిడ్డ త‌ల్లి అయినా ఇప్ప‌టికీ భీభ‌త్స‌మైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా వెలిగిపోతోంది. గ‌త కొంత‌కాలంగా సినిమాల స‌క్సెస్‌ ప‌రంగా త‌డ‌బ‌డుతున్నా, త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌లేదు. అయితే హిస్ట‌రీలో ఎంద‌రో అంద‌గ‌త్తెలు త‌మ అందాన్ని కాపాడుకునేందుకు, వ‌య‌సును క‌ప్పి పుచ్చుకునేందుకు ఎన్నో చేశార‌ని విన్నాం. అమృతం తాగి నిత్య‌య‌వ్వ‌నంతో తుల‌తూగే దేవ‌క‌న్య‌లా ఉండిపోవాల‌ని ఐష్ అనుకుంటోందా లేదా? మ‌రి ఐశ్వ‌ర్యారాయ్ ఇప్పుడు ఆ వ‌య‌సును క‌ప్పి పుచ్చేందుకు ఏం చేయ‌బోతోంది? వ‌య‌సు అయిపోకుండా కాపాడుకునేందుకు `మిస్ గ్రానీ`అవుతుందా?  ఏం చేస్తుంది?  50-60 వ‌య‌సు భామ్మ‌గారు 20 ఏజ్‌ వేషాలు వేసిన చందంగా ఐష్ ఇంకేదైనా చేయ‌బోతోందా?  వెయిట్ అండ్ సీ..




Full View
Tags:    

Similar News