ఐష్ డోస్ లో అంత సీన్ లేదంటున్నారే

Update: 2016-10-18 05:02 GMT
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్.. యంగ్ హీరో రణబీర్ కపూర్ లు జంటగా నటించిన మూవీ ఏ దిల్ హై ముష్కిల్. 22 ఏళ్ల క్రితం మిస్ వరల్డ్ కిరీటం సాధించిన ఐష్.. 42 ఏళ్ల వయసులో తనకంటే 9 ఏళ్లు చిన్నోడయిన రణబీర్ తో రొమాన్స్ చేయడం ఆశ్చర్యం కలిగించినా.. ట్రైలర్ లో సాంగ్ ప్రోమోస్ లో కనిపించినంతవరకూ చూసినా.. సీనియర్ నటిగా ఐష్ చూపించిన ట్యాలెంట్ కి బోలెడన్ని మార్కులు పడ్డాయి. సినిమాపై కూడా బాగానే ఆసక్తి నెలకొంది.

అయితే.. అటు సినిమాలో మాత్రమే కాకుండా.. బయట ఫోటో షూట్స్ కూడా రెచ్చిపోయి చేసేసినట్లుగా కనిపించింది. రీసెంట్ గా ఫిలిం ఫేర్ షూట్ కోసం బాగా ఇంటెన్సిటీ పండిచేశారనే ఫీలింగ్ కలిగింది. కుర్రాడితో కలిసి ఐష్‌ తెగ రెచ్చిపోతుందేమో అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు ఫుల్లుగా ఆ ఫోటోలు బయటకొచ్చాక చూస్తే మాత్రం.. లోపల డోస్ తక్కువగానే ఉందనే విషయం అర్ధమవుతోంది.

ఎంత దాచుకుందామని అనుకున్నా ఐశ్వర్యారాయ్ కళ్లలో మాత్రం ఆ ఏజ్ కనిపించేస్తోంది. స్కిన్ వరకూ కాపాడుకోగలిగినా.. ఐష్ కళ్లలో ఆ మెరుపులు మాత్రం బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిపోతోంది. పైగా ఫోటోషూట్ కోసం రణబీర్-ఐష్ లు తెగ రెచ్చిపోతారని అనుకుంటే.. అది కూడా జరగలేదు. మరి.. సినిమా విషయంలో ఐష్ ఎలా మ్యానేజ్ చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News